News March 17, 2024
మేడారంలో వస్తువులు మాయం!

మేడారం మహా జాతర సమయంలో ఐటీడీఏ క్యాంపు కార్యాలయంలో వినియోగించిన పలు రకాల విలువైన వస్తువులు మాయమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. జాతర సమయంలో వీవీఐపీలు, వీఐపీలకు భోజనం, తాగునీరు, ఇతర సౌకర్యాల కోసం కొనుగోలు చేసిన వస్తువులు కనిపించడం లేదు. వీటిలో డిన్నర్ సెట్లు, మిక్సీలు, కూలర్లు, రిఫ్రిజిరేటర్, డైనింగ్ సెట్లు తదితర వస్తువులు జాతర ముగిసిన అనంతరం రాత్రికి రాత్రే మాయం కాగా.. దీనిపై విచారణ జరుగుతోంది.
Similar News
News April 6, 2025
భద్రకాళి అమ్మవారికి లిల్లీ పూలతో లక్ష పుష్పార్చన

వరంగల్ భద్రకాళి దేవస్థానంలో వసంత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఆలయ అర్చకులు అమ్మవారికి లిల్లీ పూలతో లక్ష పుష్పార్చన నిర్వహించారు. అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భద్రకాళి దేవస్థానం అర్చకులు, భక్తులు తదితరులున్నారు.
News April 6, 2025
రేపు వరంగల్ మార్కెట్ ప్రారంభం

రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం పునః ప్రారంభం కానుంది. నిన్న, ఈరోజు వారాంతపు సెలవులు కావడంతో మార్కెట్ బంద్ ఉంది. దీంతో రేపు ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరుకు మార్కెట్‌కు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. కాగా ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.
News April 6, 2025
WGL: పల్లి గింజపై శ్రీరాముని ప్రతిమ

వరంగల్ నగరంలోని కాశిబుగ్గకు చెందిన మైక్రో ఆర్టిస్ట్ కుసుమ లింగమూర్తి మరోసారి తన ప్రతిభ చాటారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని పల్లి గింజపై శ్రీరాముని ప్రతిమను చిత్రీకరించారు. ఈ సందర్భంగా పలువురు అభినందిస్తున్నారు. గతంలో ఆయన శనిగపప్పుపై వివేకానందుడు, పల్లికాయపై వినాయకుడి ప్రతిమలను గీసి ఔరా అనిపించారు.