News January 11, 2025
దేశవ్యాప్తంగా 930 మందిని డిజిటల్ అరెస్ట్ చేసిన మాస్టర్‌మైండ్ అరెస్ట్!
డిజిటల్ అరెస్టు స్కామ్ మాస్టర్‌మైండ్స్‌లో ఒకరైన చిరాగ్ కపూర్‌ను కోల్‌కతా పోలీసులు బెంగళూరులో అరెస్టు చేసినట్టు NEWS18 తెలిపింది. అతడికి 930 కేసులతో సంబంధం ఉంది. మోసపోయిన దేబశ్రీ దత్తా Rs7.4L బదిలీ చేసిన JSFB A/C ద్వారా కూపీ లాగారు. ఆనంద్‌పూర్, పటౌలి, నరేంద్రపురి ప్రాంతాల్లో ఆఫీసులను గుర్తించి 104 passbooks, 61mobiles, 33 debit cards, 2QR code machines, 140sims, 40 seals స్వాధీనం చేసుకున్నారు.
Similar News
News January 11, 2025
‘ఇండియన్-2’ లైఫ్ టైమ్ కలెక్షన్లు క్రాస్ చేసిన ‘గేమ్ ఛేంజర్’!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమాకు రెండో రోజూ భారీగానే కలెక్షన్లు వస్తున్నట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలో ‘గేమ్ ఛేంజర్’ వసూళ్లు కమల్ హాసన్ నటించిన ‘భారతీయుడు-2’ లైఫ్ టైమ్ కలెక్షన్లు దాటేసినట్లు తెలిపాయి. శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రం రూ.151 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది. కాగా, ‘గేమ్ ఛేంజర్’ మొదటి రోజే రూ.186 కోట్లు కలెక్ట్ చేయడం గమనార్హం.
News January 11, 2025
సంక్రాంతి పండుగ ఎందుకు జరుపుకుంటారంటే?
సంక్రాంతి రైతుల పండుగ. ఈ పండుగ నాటికి అన్నదాతలు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం ఇంటికి చేరుతుంది. ఆ సంతోషంలోనే ఈ పండుగ జరుపుకుంటారు. తమకు సహాయం చేసిన పశువులను పూజిస్తారు. కూలీలకు పండిన ధాన్యంలో కొంత ఇస్తారు. గంగిరెద్దులు, హరిదాసులు, జంగాలు అందరూ సంక్రాంతికే కనిపిస్తారు. వారందరికీ ప్రజలు సంతోషంగా దానధర్మాలు చేస్తారు. ప్రజలు ఒకరితో మరొకరు కృతజ్ఞతతో మెలగాలని చాటి చెప్పడమే ఈ పండుగ ఉద్దేశం.
News January 11, 2025
‘గేమ్ ఛేంజర్’ టికెట్ రేట్ల పెంపు ఉత్తర్వుల ఉపసంహరణ
TG: గేమ్ ఛేంజర్ మూవీకి ప్రభుత్వం మరో బిగ్ షాకిచ్చింది. టికెట్ ధరలను పెంచుకోవచ్చంటూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకుంది. హైకోర్టు ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇప్పటికే తెల్లవారుజాము <<15130242>>స్పెషల్ షోలను రద్దు<<>> చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా ఇకపై స్పెషల్ షోలకు అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో మూవీ కలెక్షన్లపై ప్రభావం పడనుంది.