News January 11, 2025
ప.గో: రెండు బస్సులు సీజ్.. రూ.14లక్షలు ఫైన్
సంక్రాంతి పండుగ సందర్భంగా దూరప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికుల వద్ద నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ అధిక రేట్లతో టికెట్లను అమ్ముతున్నారని సమాచారం మేరకు రవాణా శాఖ అధికారులు ప.గో.జిల్లాలో శనివారం తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించి బస్సులు నడిపితే కఠినంగా శిక్షిస్తామని జిల్లా రవాణా శాఖ అధికారి ఉమామహేశ్వరరావు అన్నారు. ఈ తనిఖీల్లో 96 కేసులు నమోదు చేసి, రూ.14లక్షలు ఫైన్ వేసి, 2బస్సులను సీజ్ చేశామన్నారు.
Similar News
News January 12, 2025
పర్యాటక హబ్‌గా రూపొందిస్తాం: మంత్రి దుర్గేశ్
నరసాపురం ప్రాంతాన్ని ఒక పర్యాటక హబ్‌గా రూపొందిస్తామని, తద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని టూరిజం అండ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. శనివారం నరసాపురం వైఎన్ కళాశాల ప్లాటినం జూబ్లీ వేడుకలలో ఆయన పాల్గొని మాట్లాడారు. టూరిజంను ఒక పరిశ్రమగా గుర్తించి, అభివృద్ధి చేస్తామన్నారు. అంతర్వేది మంచి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు.
News January 11, 2025
పెదవేగి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
పెదవేగి మండలం సీతాపురం గ్రామ శివారులో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాలు ప్రకారం.. ద్విచక్ర వాహనంపై అటుగా వస్తున్న ఓ వ్యక్తిని టిప్పర్ లారీ ఢీకొట్టిందని తెలిపారు. ఈ ఘటనలో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతి చెందిన వ్యక్తి రామసింగవరం గ్రామానికి చెందిన కేబుల్ ఆపరేటర్ శ్యామ్‌గా గుర్తించారు.
News January 11, 2025
ప.గో: విమాన ధరలతో పోటీ పడుతున్న బస్సు ధరలు
సంక్రాంతి కోసం సొంత గ్రామాలకు నగరవాసులు తరలిరావడంతో ప్రెవేట్ బస్ ఛార్జీలు విమాన ధరలతో పోటీ పడుతున్నాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగులకు శని, ఆదివారాలు వీకెండ్ 13,14,15 తేదీలు వరుసగా సంక్రాంతి సెలవులు కావడంతో ధరలకు రెక్కలు వచ్చాయి. దీంతో పాలకొల్లు, భీమవరం, నరసాపురం పట్టణాలకు వచ్చేందుకు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి టికెట్ ధరలు సాధారణంగా వెయ్యి లోపు ఉంటే ఇప్పుడు రూ.3వేల నుంచి 5 వేలకు పెరిగాయి.