News March 17, 2024
ఖమ్మం : మట్టి కుండలకు భలే డిమాండ్

ఎండలు మండిపోతుండడంతో ప్రజలు చల్లని నీళ్లు తాగేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఫ్రిడ్జ్ లు, వాటర్ కూలర్ లో నీటిని తాగడంతో అనేక సమస్యలు తలెత్తుతుండడంతో ఆరోగ్యం కోసం మట్టికుండల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక ఫ్రిడ్జ్ లు, వాటర్ కూలర్ కొనుగోలు చేయలేని పేదలు వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఈమేరకు నగరంలోని ప్రధాన వీధుల్లో వ్యాపారులు పలు రకాల కుండలను తీసుకువచ్చి విక్రయిస్తున్నారు.
Similar News
News September 8, 2025
ఖమ్మం: గణేశ్ ఉత్సవాలపై సీపీ ప్రశంసపీ

గణేశ్ ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించడానికి అహర్నిశలు శ్రమించిన పోలీసు, హోంగార్డు సిబ్బందిని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. వినాయక నవరాత్రుల నుంచి నిమజ్జనం వరకు ఎటువంటి అవాంతరాలు లేకుండా ఉత్సవాలు జరగడానికి సహకరించిన భక్తులకు, వివిధ శాఖల సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.
News September 8, 2025
భద్రాచలం: 23 నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఈ నెల 23 నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 2న జరిగే విజయదశమి వేడుకలతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. ఉత్సవాల సందర్భంగా ఆలయంలో కొలువై ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారు 23 నుంచి రోజుకో అలంకరణలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. అక్టోబర్ 7న శబరి స్మృతియాత్ర నిర్వహిస్తామని ఆలయ ఈవో దామోదర్ రావు, వైదిక కమిటీ సభ్యులు తెలిపారు.
News September 7, 2025
అసంపూర్తి గణనాథుల నిమజ్జనం.. భక్తుల ఆవేదన

ఖమ్మం మున్నేరు నది ఒడ్డున అసంపూర్తిగా నిమజ్జనం చేసిన గణేశ్ విగ్రహాలు కనిపించడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిమజ్జనం చేసే సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. భారీ క్రేన్లు, గజ ఈతగాళ్లు ఉన్నప్పటికీ నిమజ్జనం సరిగా జరగలేదని విమర్శించారు. అధికారులు స్పందించి విగ్రహాలను పూర్తిస్థాయిలో నిమజ్జనం అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.