News March 17, 2024
BREAKING: నెల్లూరులో తప్పిన ప్రమాదం
నెల్లూరు ప్రధాన రైల్వే స్టేషన్‌లో ఆదివారం పెనుప్రమాదం తప్పింది. ప్లాట్ ఫాం-1పై హెటెన్షన్ వైర్ తెగిపడింది. దీంతో రైలు కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. ఘటన సమయంలో పట్టాలపై రైలు లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రైల్వే అధికారులు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మరమ్మతులు చేశారు.
Similar News
News November 16, 2024
నెల్లూరు: కాలువలో పడి ఇద్దరు చిన్నారులు మృతి
చిల్లకూరు మండలం ఏరూరు గ్రామంలోని అల్లిపురం గిరిజన కాలనీలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు సొన కాలువలో పడి అల్లిపురం గిరిజన కాలనీకి చెందిన నాగేంద్రమ్మ(11), చింతాలయ్య(11) అనే ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News November 16, 2024
సూళ్లూరుపేట: మహిళతో అసభ్య ప్రవర్తన.. వ్యక్తి అరెస్ట్
సత్యవేడు మండలం ఆరూరులో మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన స్టాలిన్ అనే వ్యక్తిని శనివారం అరెస్టు చేసినట్లు శ్రీసిటీ డిఎస్పీ పైడేశ్వరరావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఇంటర్వ్యూకు వెళుతున్న ఓ మహిళను ద్విచక్ర వాహనంలో ఎక్కించుకొని అసభ్యకరంగా ప్రవర్తించినట్లు చెప్పారు. మహిళ ఫిర్యాదు మేరకు అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాసులు పాల్గొన్నారు.
News November 16, 2024
నెల్లూరులో భారీ వర్షం
నెల్లూరు నగరంలో భారీ వర్షం కురుస్తోంది. నెల్లూరు నగరంలోని వేదయపాలెం, జ్యోతి నగర్, రామ్మూర్తి నగర్, నిపోసెంటర్, కరెంట్ ఆఫీస్ సెంటర్ మొదలైన ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. రోడ్లు, కాలువలు వర్షపు నీటితో నిండిపోయాయి. రోడ్లపై ప్రయాణించే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.