News March 17, 2024
చంద్రబాబును కలిసిన DA శ్రీనివాస్

దివంగత MP ఆదికేశవులు నాయుడు కుమారుడు DA శ్రీనివాస్ హైదరాబాద్‌లో చంద్రబాబును కలవడం ఆసక్తి మారింది. ఇటీవల ఆయన టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీల్లో చేరుతారని వివధ రకాలు వార్తలు వచ్చాయి. చిత్తూరులో ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఓ కార్యక్రమంలో రాజకీయాల్లోకి వస్తానని చెప్పిన శ్రీనివాస్ ఆ తర్వాత కనిపించలేదు. అప్పట్లో పెద్దిరెడ్డిని కలిసిన ఆయన నేడు చంద్రబాబుతో భేటి కావడం ఆసక్తి రేపుతోంది.
Similar News
News February 4, 2026
చిత్తూరు: పోస్టాఫీసులో ఉద్యోగాలు.. APPLY చేసుకోండి.!

చిత్తూరు డివిజనల్ పోస్టాఫీస్ పరిధిలో 23 ఖాళీలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఏబీపీఎం, బీపీఎం, డాక్ సేవక్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. https://www.indiapost.gov.in/ లో ఈనెల 16 లోపు దరఖాస్తు చేయాలన్నారు. 18 నుంచి 40 సంవత్సరాలలోపు, పదో తరగతి ఉత్తీర్ణత కలిగిన వారు అర్హులన్నారు. ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీలు, దివ్యాంగులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుందన్నారు.
News February 4, 2026
హాస్టళ్లలో సౌకర్యాల కల్పనకు కృషి: కలెక్టర్

జిల్లాలోని 113 సంక్షేమ వసతి గృహాలను నెట్ జీరో ప్రాంగణంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. కలెక్టరేట్లో పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి వసతి గృహంలో కచ్చితంగా ఆర్వో ప్లాంట్, మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యం, ఫ్యాన్, సోలార్ లైటింగ్, కిచెన్ గార్డెన్లు ఉండాలన్నారు. ప్రతి హాస్టల్ కు రూ. 50 వేల నిధులు మంజూరు చేస్తామన్నారు.
News February 4, 2026
చిత్తూరు జిల్లాలో 185 సమస్యలు గుర్తించాం: SE

జిల్లాలో మంగళవారం కరెంటోళ్ల జనబాట కార్యక్రమం నిర్వహించారు. జిల్లా పరిధిలోని 40 సెక్షన్లలో అధికారులు, సిబ్బంది పర్యటించి సమస్యలను గుర్తించారు. అందులో భాగంగా 11 కేవీ ఫీడర్ల పరంగా 110 సమస్యలు, ట్రాన్స్‌ఫార్మర్ల పరంగా 6, LT లైన్ల పరంగా 60, సర్వీసు లైన్ పరంగా 15 కలిపి మొత్తం 185 సమస్యలను గుర్తించినట్లు SE ఇస్మాయిల్ అహ్మద్ తెలిపారు. వాటిలో 17 సమస్యలను పరిష్కరించామన్నారు.


