News January 11, 2025

BREAKING: గేమ్ ఛేంజర్ స్పెషల్ షోలు రద్దు

image

TG: రాష్ట్రంలో ‘గేమ్ ఛేంజర్’ మూవీ స్పెషల్ షోలను రద్దు చేస్తూ హోంశాఖ ఉత్తర్వులిచ్చింది. దీంతో రేపటి నుంచి మార్నింగ్ స్పెషల్ షోలు నిలిచిపోనున్నాయి. టికెట్ ధరల పెంపు, ప్రత్యేక ప్రదర్శనలపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. బెనిఫిట్ షోలను రద్దు చేసి స్పెషల్ షోలకు అనుమతి ఇవ్వడాన్ని న్యాయస్థానం ఆక్షేపించింది. దీనిపై పునరాలోచించాలని చెప్పింది. దీంతో ఆ షోలను ప్రభుత్వం రద్దు చేసింది.

Similar News

News November 16, 2025

దిష్టిలో ఉన్న శాస్త్రీయత ఏమిటి..?

image

చిన్నపిల్లలు ఆహారం సరిగా తీనకపోయినా, విరేచనాలైనా దిష్టి తగిలిందని పెద్దలు అంటుంటారు. దిష్టి తీశాక పిల్లలు చలాకీగా ఆడుకుంటారు. దీని వెనకున్న సైన్స్ ఏంటంటే.. మన కళ్లకు సౌమ్యదృష్టి, క్రూర దృష్టి అనేవి ఉంటాయి. ఈ చూపుల ప్రభావంతో శరీరం నలతకు గురవుతుంది. ఉప్పు, మిరపకాయతో దిగదీయుట, వాటిని నిప్పులో వేయుట వలన వచ్చే పొగ ముక్కు ద్వారా పీల్చుకోవడం వలన నలత దూరమై, శరీరాన్ని తేలిక చేస్తుంది. <<-se>>#Scienceinbelief<<>>

News November 16, 2025

కర్మయోగి భారత్‌లో ఉద్యోగాలు

image

కర్మయోగి భారత్ 8 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 6 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, B.COM, B.Sc, బీటెక్, BE, LLB, PG, M.Sc, ME, ఎంటెక్, MBA, PGDM, MCA ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 50ఏళ్లు. షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: igotkarmayogi.gov.in

News November 16, 2025

రేపటి నుంచి స్కూళ్లలో ఆధార్ స్పెషల్ క్యాంపులు

image

AP: రాష్ట్రంలోని స్కూళ్లలో రేపటి నుంచి ఈ నెల 26 వరకు ప్రత్యేక ఆధార్ క్యాంపులను ప్రభుత్వం నిర్వహించనుంది. 5-15 ఏళ్ల పిల్లలు వారి బయోమెట్రిక్, పేరు, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్ తదితర వివరాలను అప్డేట్ చేసుకునేందుకు వీలు ఉంటుంది. విద్యార్థుల వెంట పేరెంట్స్ వారి ఆధార్ కార్డును తీసుకెళ్లాలి. కాగా రాష్ట్రంలో ఇప్పటికీ 15.46 లక్షల మంది పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాల్సి ఉందని అధికారులు తెలిపారు.