News January 11, 2025
విజయవాడ మీదుగా అన్ రిజర్వ్‌డ్ స్పెషల్ రైళ్లు

ప్రయాణికుల సౌలభ్యం మేరకు చర్లపల్లి(CHZ)- విశాఖపట్నం(VSKP) మధ్య జనసాధారణ్ ప్రత్యేక రైళ్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ మేరకు నం.08538 CHZ- VSKP రైలును ఈ నెల 12,16,17 తేదీలలో, నం.08537 VSKP- CHZ రైలును ఈ నెల 15, 16న నడుపుతామని, ఈ రైళ్లలో అన్ రిజర్వ్డ్ సెకండ్ క్లాస్ కోచ్‌లు మాత్రమే ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో విజయవాడలో మాత్రమే ఈ రైళ్లు ఆగుతాయన్నారు.
Similar News
News March 22, 2026
మీ సమస్యలపై రేపు ఫిర్యాదు చేయవచ్చు: కృష్ణా కలెక్టర్

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమాన్ని ఈ నెల 23వ తేదీ సోమవారం మచలీపట్నంలోని కలెక్టరేట్‌లో నిర్వహించనున్నట్టు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. ఉదయం 11గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారన్నారు. డివిజన్, మండల స్థాయిలో కూడా పీజీఆర్ఎస్ నిర్వహించి ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించడం జరుగుతుందన్నారు.
News March 22, 2026
కృష్ణా: ప్రారంభమైన ఇంటర్ పరీక్షల స్పాట్ వాల్యుయేషన్

మచిలీపట్నంలోని నోబుల్ కాలేజ్‌లో ఇంటర్ పరీక్షల స్పాట్ వాల్యుయేషన్ ఆదివారం ప్రారంభమైంది. జిల్లాకు 2 లక్షల సమాధాన పత్రాలు వచ్చాయని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారిణి సరళా కుమారి తెలిపారు. 225 మంది ఎగ్జామినర్‌లను నియమించగా ఒకొక్కరు రోజుకు 30 సమాధాన పత్రాలను వాల్యుయేషన్ చేస్తారన్నారు. వాల్యుయేషన్‌లో పాల్గొనే సిబ్బందికి అన్ని రకాల వసతులు కల్పించినట్లు ఆమె తెలిపారు.
News March 22, 2026
కృష్ణా: అపరాల రైతుల తిప్పలు.. పట్టాల కోసం పరుగులాట!

జిల్లాలో మారుతున్న వాతావరణం అపరాల సాగు రైతులను కలవరపెడుతోంది. అకాల వర్షాల ముప్పు నుంచి పంటను కాపాడుకునేందుకు రైతులు టార్ఫాలిన్ పట్టాల కోసం పరుగులు తీస్తున్నారు. డిమాండ్ ఒక్కసారిగా పెరగడంతో మార్కెట్‌లో పట్టాల కొరత ఏర్పడింది. చేసేది లేక అద్దె కేంద్రాల వద్ద లభించే చినిగిన, పాడైన పట్టాలనే తీసుకెళ్తున్నారు. తగినన్ని పట్టాలు అందుబాటులో లేక, ఉన్నవాటికి అద్దెలు పెరగడంతో అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు.


