News March 17, 2024
నార్పల: పొలం వద్ద ఇరు వర్గాల మధ్య ఘర్షణ..

నార్పల మండలంలోని గూగుడు గ్రామంలో శనివారం రాత్రి పొలం వద్ద రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం వారిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో బైక్‌కు నిప్పు పెట్టగా పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News April 20, 2025
జిల్లాలో నేను పెట్టిన రేట్లే ఉండాలి: జేసీ ప్రభాకర్ రెడ్డి

ప్రైవేటు బస్సు యజమానులపై తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సు ఓనర్లం చిల్లర వ్యక్తులం అయ్యామని అన్నారు. తాను అనంతపురం జిల్లాలో మీటింగ్ పెడుతున్నానని తెలిపారు. జిల్లాలో నేను పెట్టిన రేట్లు మాత్రమే ఉండాలని అన్నారు. భారతదేశంలో ఎవరైనా ఎక్కడి నుంచైనా బస్సులు తిప్పుకునే స్వేచ్ఛ ఉందన్నారు. తాను మొదటిసారిగా అన్ని ప్రాంతాలకు బస్సులు నడపానని తెలిపారు.
News April 20, 2025
తాడిపత్రి: ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య

ఉద్యోగం రాలేదని యువకుడు నరసింహ (23) ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం తాడిపత్రిలో జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. నరసింహ ఇంజినీరింగ్ చదివాడు. ఉద్యోగం కోసం పలు కంపెనీలకు దరఖాస్తు చేసుకున్నాడు. అయినప్పటికీ ఉద్యోగం రాలేదు. దీంతో మనస్తాపానికి గురైన యువకుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని మృతి చెందాడు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News April 20, 2025
ATP: చెత్త సంపద తయారీ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

అనంతపురం జిల్లా రూరల్ మండలంలోని ఆకుతోటపల్లి గ్రామంలోని చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని శనివారం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామ సమీపంలోని జాతీయ రహదారిలో ఈ-వేస్ట్ కలెక్షన్ కౌంటర్, చలివేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ-వేస్ట్ ప్రత్యేక నిర్మూలన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అనంతరం మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో మరుగుదొడ్లను పరిశీలించారు.