News January 12, 2025

సంక్రాంతిని ఘనంగా జరుపుకుందాం: మంత్రి మనోహర్

image

తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిభంభించే విధంగా తెలుగింటి పండుగ సంక్రాంతిని ఘనంగా జరుపుకుందామని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. అత్తోటలో జరిగిన పల్లె పండుగ కార్యక్రమాల్లో కలెక్టర్‌తో కలిసి పాల్గొన్న ఆయన ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. గోపూజ చేసి గ్రామంలో మహిళలు తీర్చిదిద్దిన సంక్రాంతి ముగ్గులను ఆసక్తిగా తిలకించారు. గ్రామంలో రూ.1.85 లక్షలతో నిర్మించిన పశువుల షెడ్డును ప్రారంభించారు. 

Similar News

News January 12, 2026

PGRS ఫిర్యాదులు పునరావృతం కాకూడదు: SP

image

ప్రజా సమస్యలను చట్టబద్ధంగా, వేగంగా పరిష్కరించాలని ఎస్పీ వకుల్ జిందాల్ పోలీస్ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అధికారులతో కలిసి ప్రజల సమస్యలను ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుండి అందిన ఫిర్యాదులు తిరిగి పునరావృతం కాకుండా సంబంధిత స్టేషన్‌ల అధికారులు పరిష్కరించాలని చెప్పారు.

News January 12, 2026

GNT: సెలవుల్లో ఊరెళ్లే వారికి SP సూచన

image

సంక్రాంతి సెలవుల నేపథ్యంలో ఊర్లకు వెళ్లే ప్రజలు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ (LHMS)ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ వకుల్ జిందాల్ సూచించారు. ఉచితంగా అందించే ఈ సేవల ద్వారా ఇళ్ల ముందు తమ సిబ్బంది సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి భద్రతా చర్యలు చేపడతారని చెప్పారు. ప్రజలు ఊర్ల నుంచి వచ్చే వరకు గస్తీ నిర్వహిస్తారని అన్నారు. సీసీ కెమెరాల ద్వారా అనుమానిత వ్యక్తుల కదలికలు రికార్డ్ అవుతాయని పేర్కొన్నారు.

News January 12, 2026

తెనాలి సబ్ కలెక్టర్‌కు పదోన్నతి.. బదిలీ..!

image

తెనాలి సబ్ కలెక్టర్ V.సంజనా సింహ బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 14 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ చీఫ్ సెక్రటరీ కే విజయానంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా తెనాలి సబ్ కలెక్టర్‌గా పనిచేస్తున్న సంజన సింహ పల్నాడు జిల్లాకు జాయింట్ కలెక్టర్‌గా పదోన్నతి పొంది తెనాలి నుంచి బదిలీ అయ్యారు. ఐతే తెనాలి సబ్ కలెక్టర్ లేదా రెవెన్యూ డివిజన్ అధికారిగా ఎవరిని నియమిస్తారన్నది తెలియాల్సి ఉంది.