News March 17, 2024
కోహ్లీకి రోహిత్ మద్దతు?

T20WCలో చోటుపై విరాట్ కోహ్లీకి.. కెప్టెన్ రోహిత్ శర్మ మద్దతు పలికినట్లు తెలుస్తోంది. జూన్‌లో జరగనున్న ఈ మెగా టోర్నీకి అతడు భారత జట్టులో ఉండాల్సిందేనని హిట్‌మ్యాన్ బీసీసీఐ పెద్దలతో చెప్పినట్లు సమాచారం. పలువురు సెలక్టర్లు మూడో స్థానంలో ఇషాన్‌ను ఆడించాలని యోచిస్తుండగా రోహిత్ మాత్రం కోహ్లీ వైపు మొగ్గు చూపుతున్నారట. వరల్డ్ కప్‌లో విరాట్ స్థానంపై త్వరలోనే సెలక్టర్లు అఫీషియల్ ప్రకటన చేసే అవకాశం ఉంది.
Similar News
News January 10, 2026
భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ఇవాళ రూ.1,150 పెరిగి రూ.1,40,460కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,050 ఎగబాకి రూ.1,28,750 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.7వేలు పెరిగి రూ.2,75,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.
News January 10, 2026
‘వ్యవసాయ యాంత్రీకరణ’ పథకంలో రాయితీ ఇలా..

ఈ పథకం కింద యంత్రాల కొనుగోలుకు ప్రభుత్వం భారీగా సబ్సిడీ ఇస్తోంది. లబ్ధిదారుల కేటగిరీని బట్టి దీనిలో వాటా ఉంటుంది. సన్న, చిన్నకారు, మహిళా రైతులు, SC, ST, BC రైతులు యంత్రాన్ని కొనుగోలు చేస్తే ధరలో 50% వారు భరించాలి. మిగిలిన 50 శాతాన్ని ప్రభుత్వం రాయితీగా నేరుగా కంపెనీ ఖాతాలో జమ చేస్తుంది. ఇతర రైతులు యంత్రం ధరలో 60 శాతం వాటాను భరించాల్సి ఉండగా.. 40 శాతాన్ని ప్రభుత్వం సబ్సిడీ రూపంలో భరిస్తుంది.
News January 10, 2026
ప్రయాణాల్లో వాంతులవుతున్నాయా?

ప్రయాణాల్లో వాంతులు అవడం అనేది సాధారణంగా చాలా మంది ఎదుర్కొనే సమస్య. వికారంగా అనిపించడం, తల తిరగడం, పొట్టలో అసౌకర్యంగా ఉండడం ఇవన్నీ మోషన్ సిక్నెస్ లక్షణాలు. దీన్ని తగ్గించాలంటే అల్లం రసం, హెర్బల్ టీ వంటివి తాగాలి. శ్వాస వ్యాయామాలు చేయాలి. నిమ్మకాయ వాసన చూసినా వికారం తగ్గుతుంది. అలాగే ప్రయాణానికి ముందు తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. హెవీ ఫుడ్స్ సమస్యను మరింత పెంచుతాయి.


