News January 12, 2025
80 మంది విద్యార్థినుల చొక్కాలు విప్పించిన ప్రిన్సిపల్
ఝార్ఖండ్‌లో ఓ ప్రైవేట్ పాఠశాలలో దారుణం చోటుచేసుకుంది. ఓ ప్రిన్సిపల్ 80 మంది విద్యార్థినుల చొక్కాలను విప్పి ఇంటికి పంపారు. ధన్‌బాద్ జిల్లాలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో టెన్త్ పరీక్షలు ముగియడంతో విద్యార్థినులు ‘పెన్ డే’ నిర్వహించారు. ఒకరి చొక్కాలపై మరొకరు సంతకం చేసుకున్నారు. ఇది చూసిన ప్రిన్సిపల్ వారి చొక్కాలను విప్పించారు. బ్లేజర్లతోనే విద్యార్థినులను ఇంటికి పంపారు. దీనిపై పోలీసుల విచారణ జరుగుతోంది.
Similar News
News January 12, 2025
రాష్ట్రంలోకి కొత్త బీర్లు, లిక్కర్!
తెలంగాణలోకి కొత్త బ్రాండ్ మద్యం రానుంది. దీని కోసం కొత్త లిక్కర్, బీర్ కంపెనీలకు అనుమతులు ఇచ్చేందుకు సీఎం రేవంత్ పచ్చజెండా ఊపారు. ఈ మేరకు కంపెనీల కోసం నోటిఫికేషన్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కంపెనీల నాణ్యత ప్రమాణాలు, సరఫరా సామర్థ్యం పరిశీలించి పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ జరగాలన్నారు. లిక్కర్ తయారీలో కంపెనీల గుత్తాధిపత్యాన్ని సహించేది లేదన్నారు. మరోవైపు మద్యం ధరలు పెంచబోమని సీఎం స్పష్టం చేశారు.
News January 12, 2025
నేడు తిరుపతికి సీఎం చంద్రబాబు
AP: ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు తిరుపతి వెళ్లనున్నారు. తిరుచానూరులో ఇళ్లకు పైపుల ద్వారా సహజవాయువును సరఫరా చేసే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభిస్తారు. అక్కడి నుంచి తన స్వగ్రామం నారావారిపల్లెకు చేరుకుంటారు. ఈ నెల 15 వరకూ ఆయన ఊరిలోనే గడపనున్నారు. కుటుంబీకులతో కలిసి సంక్రాంతి వేడుకల్లో పాల్గొనున్నారు. ఇప్పటికే ఆయన కుటుంబం గ్రామానికి చేరుకుంది.
News January 12, 2025
ఈ రోజు చాలా ప్రత్యేకం: బాబీ
‘డాకు మహారాజ్’ రిలీజ్ సందర్భంగా దర్శకుడు బాబీ అభిమానులనుద్దేశించి ట్వీట్ చేశారు. ఇవాళ చిత్ర యూనిట్‌కు చాలా ప్రత్యేకమైనదని పేర్కొన్నారు. రెండేళ్లుగా అభిమానుల అంచనాలు, ఎమోషన్లు, ఊహలను అందుకోవాలనే తన కలను చేరుకునే క్షణమిదేనని అన్నారు. ముఖ్యంగా బాలయ్య అభిమానుల ప్రేమకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ చిత్రానికి పనిచేసిన యూనిట్‌కు ధన్యవాదాలు చెప్పారు.