News January 12, 2025
NZB: ఇంటి ముందు పార్కింగ్ చేసిన కారు చోరీ

నిజామాబాద్‌లో ఇంటి ముందు పార్కింగ్ చేసిన కారును దుండగులు చోరీ చేసినట్లు శనివారం మూడో టోన్ ఎస్‌ఐ హరిబాబు తెలిపారు. ఆయన వివరాలు.. గౌతమ్ నగర్‌కు చెందిన పవన్ ఈ నెల 9వ తేదీన తన ఇంటి ముందు కారు పార్క్ చేసి హైదరాబాద్‌కు వెళ్లాడు. మరుసటి రోజు వచ్చి వచ్చే సరికి పార్కింగ్ చేసిన కారు చోరీకి గురైంది. బాధితుడు మూడో టౌన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు.
Similar News
News November 7, 2025
NZB: ఈ నెల 8 నుంచి రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీలు

తెలంగాణ అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 8 నుంచి 9 వరకు సీనియర్ పురుషులు, మహిళల రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలను HYD సుల్తాన్ సాయి ప్లే గ్రౌండ్‌లో ఓపెన్ క్యాటగిరిలో నిర్వహిస్తామని NZB రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు భక్తవత్సలం తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు తమ ఒరిజినల్ ఆధార్ కార్డ్, బర్త్ సర్టిఫికెట్‌తో హాజరుకావాలన్నారు. మరింత సమాచారం కోసం ఫోన్ నంబర్ 9550358444కు సంప్రదించాలన్నారు.
News November 7, 2025
నిజామాబాద్ జిల్లాలో సెక్షన్ 163 అమలు

టీజీపీఎస్సీ నిర్వహిస్తున్న డిపార్ట్‌మెంట్ పరీక్షల నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా పరిధిలోని పరీక్షా కేంద్రాల వద్ద ఈ నెల 8 నుంచి 14 వరకు ఉదయం 8గం.ల నుంచి సాయంత్రం 6 గం.ల వరకు బీఎన్ఎస్ సెక్షన్ 163 అమలు చేయనున్నట్లు సీపీ సాయిచైతన్య తెలిపారు. ఇద్దరూ లేదా అంతకంటే ఎక్కువ మంది పరీక్షా కేంద్రాల వద్ద గుమిగూడరాదని, నిషేధిత వస్తువులతో పరీక్షా కేంద్రం వద్ద తిరగవద్దని సీపీ సూచించారు.
News November 6, 2025
ప్రతి విద్యార్థి వివరాలను యూడైస్‌లో నమోదు చేయాలి: NZB కలెక్టర్

అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లోని ప్రతి విద్యార్థికి సంబంధించిన వివరాలను యూడైస్‌లో నమోదు చేయాలని NZB కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. నిజామాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో గురువారం విద్యా శాఖ అధికారులు, కళాశాలల ప్రిన్సిపల్స్, HMలతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. విద్యార్థుల ప్రయోజనార్థం ప్రభుత్వం వారి వివరాలను యూడైస్‌లో నిక్షిప్తం చేయిస్తోందన్నారు.


