News March 17, 2024

ఏడుపాయల దుర్గమ్మ దర్శనానికి బారులు దీరారు

image

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ ఏడుపాయల వన దుర్గాభవాని మాత దర్శనానికి పోటెత్తారు. అదివారం సెలవు దినం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. అమ్మవారికి తలనీలాలు సమర్పించి, వనదుర్గ భవాని మాతకు ఓడి బియ్యం పోసి, కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఛైర్మన్ బాల గౌడ్, ఈఓ మోహన్ రెడ్డి, పోలీస్ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు.

Similar News

News July 5, 2024

ప్రజల్లో చైతన్యం నింపడంలో కవులు, రచయితలు ముందుండాలి: KCR

image

తెలంగాణ ప్రజల్లో చైతన్యాన్ని నింపడంలో కవులు రచయితలు ముందుండాలని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, MLC గోరేటి వెంకన్న ఎర్రవెల్లి ఫాంహౌజ్‌లో కేసీఆర్‌తో భేటీ అయ్యారు. తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన నదీ జలాల వాటాను సాధించుకోవడంలో ఉమ్మడి రాష్ట్రంలో నాటి ఆంధ్రా నాయకత్వ స్వార్థంతో పాటు, తెలంగాణ నాయకత్వం అనుసరించిన నిర్లక్ష్య ధోరణి సోయిలేని తనం ప్రధాన కారణాలన్నారు.

News July 5, 2024

సిద్దిపేట: తల్లిని చంపి సహజ మరణంగా..

image

కొడుకు తల్లిని చంపి సహజ మరణంగా చిత్రీకరించాడు. పోలీసుల వివరాలు.. HYDకి చెందిన బాలకృష్ణమ్మ(54) కొడుకు సర్వేశ్, పక్కింటివారితో కలిసి నాచారంగుట్ట క్షేత్రానికి వచ్చింది. రాత్రి ఆమె అస్వస్థతకు గురి కాగా కొడుకు అసహనంతో తల్లి తలను నేలకేసి కొట్టడంతో స్పాట్‌లోనే చనిపోయింది. సహజ మృతిగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంట వెళ్లిన వారి ద్వారా అసలు విషయం తెలుసుకుని ఆమె కుమార్తె సుజాత పోలీసులకు ఫిర్యాదు చేసింది.

News July 5, 2024

మెదక్: పరేషాన్‌లో గ్రామ పంచాయతీలు..!

image

గ్రామ పంచాయతీలు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. పారిశుద్ధ్యం, అభివృద్ధి పనులకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది. సిద్దిపేట(499), మెదక్‌(469), సంగారెడ్డి(647) జిల్లాల్లో మొత్తం 1615 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆర్నెళ్లుగా పంచాయతీలకు ఒక్క రూపాయి నిధులు ఇవ్వలేదని తెలిసింది. ఫిబ్రవరి నుంచి గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతుంది. ప్రత్యేకాధికారుల పాలనకు ముందే పంచాయతీల్లో నిధులు ఖాళీ అయ్యాయి.