News January 12, 2025
నేడు తిరుపతికి సీఎం చంద్రబాబు
AP: ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు తిరుపతి వెళ్లనున్నారు. తిరుచానూరులో ఇళ్లకు పైపుల ద్వారా సహజవాయువును సరఫరా చేసే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభిస్తారు. అక్కడి నుంచి తన స్వగ్రామం నారావారిపల్లెకు చేరుకుంటారు. ఈ నెల 15 వరకూ ఆయన ఊరిలోనే గడపనున్నారు. కుటుంబీకులతో కలిసి సంక్రాంతి వేడుకల్లో పాల్గొనున్నారు. ఇప్పటికే ఆయన కుటుంబం గ్రామానికి చేరుకుంది.
Similar News
News January 12, 2025
కేటీఆర్‌ను నేనేం పొగడలేదు: దానం
TG: <<15124836>>తాను కేటీఆర్‌ను పొగిడానంటూ<<>> వచ్చిన వార్తలపై దానం నాగేందర్ స్పందించారు. ‘హైదరాబాద్ ఇమేజ్‌ను చంద్రబాబు, వైఎస్ పెంచారు. బీఆర్ఎస్, కేటీఆర్ నగరానికి చేసిందేం లేదు. హైడ్రా విషయంలో నా మాట మీదే ఉన్నా. దాని వల్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ఆ విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలి. ఫార్ములా-ఈ కారు రేసుతో హైదరాబాద్ ఇమేజ్ పెరిగింది. అలా అని నేను కేటీఆర్‌కు క్లీన్ సర్టిఫికెటేం ఇవ్వడం లేదు’ అని తెలిపారు.
News January 12, 2025
LOS ANGELES: కార్చిచ్చు ఆర్పేందుకు నీళ్లూ కరవు..!
లాస్ ఏంజెలిస్‌లో కార్చిచ్చు మరింత ఉద్ధృతమవుతోంది. నగరం వైపుగా భీకర గాలులు వీస్తుండటంతో మంటలు ఒక చోట నుంచి మరో చోటుకు వ్యాపిస్తున్నాయి. మంటలు ఆర్పేందుకు అక్కడ తీవ్ర నీటి కొరత ఏర్పడింది. కొన్ని చోట్ల అధికారులు ట్యాంకర్లతో నీటిని తరలించి మంటలు అదుపు చేస్తున్నారు. కాగా కొందరు హాలీవుడ్ స్టార్లు వారికి కేటాయించిన దానికంటే అదనంగా నీటిని వాడుకుని గార్డెన్లు పెంచుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
News January 12, 2025
కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన
TG: కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకంపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. వీటి కోసం జనవరి 16 నుంచి 20 వరకు ఫీల్డ్ వెరిఫికేషన్ జరుగుతుందన్నారు. లబ్ధిదారుల ముసాయిదా జాబితాను 21 నుంచి 24 వరకు గ్రామ, వార్డు సభల్లో పెట్టి ప్రజాభిప్రాయం తీసుకుంటామని చెప్పారు. 26 నుంచి కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు పంపిణీ చేస్తామని తెలిపారు. రేషన్ కార్డులకు గత నిబంధనలే వర్తిస్తాయని స్పష్టం చేశారు.