News January 12, 2025

రాష్ట్రంలోకి కొత్త బీర్లు, లిక్కర్!

image

తెలంగాణలోకి కొత్త బ్రాండ్ మద్యం రానుంది. దీని కోసం కొత్త లిక్కర్, బీర్ కంపెనీలకు అనుమతులు ఇచ్చేందుకు సీఎం రేవంత్ పచ్చజెండా ఊపారు. ఈ మేరకు కంపెనీల కోసం నోటిఫికేషన్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కంపెనీల నాణ్యత ప్రమాణాలు, సరఫరా సామర్థ్యం పరిశీలించి పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ జరగాలన్నారు. లిక్కర్ తయారీలో కంపెనీల గుత్తాధిపత్యాన్ని సహించేది లేదన్నారు. మరోవైపు మద్యం ధరలు పెంచబోమని సీఎం స్పష్టం చేశారు.

Similar News

News January 12, 2025

లాస్ ఏంజెలిస్ కార్చిచ్చులో బాలీవుడ్ నటి

image

లాస్ ఏంజెలిస్‌లో ఏర్పడిన కార్చిచ్చులో బాలీవుడ్ స్టార్ నటి ప్రీతి జింటా చిక్కుకున్నారు. అక్కడి పరిస్థితులను వివరిస్తూ ఆమె ట్వీట్ చేశారు. ‘చుట్టూ జరుగుతోన్న విధ్వంసం చూసి భయాందోళనకు గురయ్యాం. చిన్న పిల్లలు, వృద్ధులతో చాలా మంది పొరుగువారు ఇళ్లను వదిలి వెళ్లిపోయారు. ఇవన్నీ చూసి నేను హృదయవిదారకంగా ఉన్నా. మమ్మల్ని సురక్షితంగా ఉంచినందుకు దేవుడికి & అగ్నిమాపక సిబ్బందికి కృతజ్ఞతలు’ అని ట్వీట్ చేశారు.

News January 12, 2025

కేటీఆర్‌ను నేనేం పొగడలేదు: దానం

image

TG: <<15124836>>తాను కేటీఆర్‌ను పొగిడానంటూ<<>> వచ్చిన వార్తలపై దానం నాగేందర్ స్పందించారు. ‘హైదరాబాద్ ఇమేజ్‌ను చంద్రబాబు, వైఎస్ పెంచారు. బీఆర్ఎస్, కేటీఆర్ నగరానికి చేసిందేం లేదు. హైడ్రా విషయంలో నా మాట మీదే ఉన్నా. దాని వల్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ఆ విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలి. ఫార్ములా-ఈ కారు రేసుతో హైదరాబాద్ ఇమేజ్ పెరిగింది. అలా అని నేను కేటీఆర్‌కు క్లీన్ సర్టిఫికెటేం ఇవ్వడం లేదు’ అని తెలిపారు.

News January 12, 2025

LOS ANGELES: కార్చిచ్చు ఆర్పేందుకు నీళ్లూ కరవు..!

image

లాస్ ఏంజెలిస్‌లో కార్చిచ్చు మరింత ఉద్ధృతమవుతోంది. నగరం వైపుగా భీకర గాలులు వీస్తుండటంతో మంటలు ఒక చోట నుంచి మరో చోటుకు వ్యాపిస్తున్నాయి. మంటలు ఆర్పేందుకు అక్కడ తీవ్ర నీటి కొరత ఏర్పడింది. కొన్ని చోట్ల అధికారులు ట్యాంకర్లతో నీటిని తరలించి మంటలు అదుపు చేస్తున్నారు. కాగా కొందరు హాలీవుడ్ స్టార్లు వారికి కేటాయించిన దానికంటే అదనంగా నీటిని వాడుకుని గార్డెన్లు పెంచుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి.