News January 12, 2025
స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు వీఆర్ఎస్
AP: విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఉద్యోగులకు స్వచ్ఛంద విరమణ పథకాన్ని(వీఆర్ఎస్) ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 1 తర్వాత ఉద్యోగంలో ఉన్నవారికి ఇది వర్తిస్తుందని, ఆలోపు రిటైర్ అయ్యేవారికి కుదరదని తెలిపింది. అర్హత కలిగిన వారు ఈ నెల 15 నుంచి 31 తేదీల మధ్యలో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. కాగా.. ప్రైవేటీకరణలో భాగంగానే మేనేజ్మెంట్ ఈ పథకాన్ని తీసుకొచ్చిందని విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ ఆరోపించింది.
Similar News
News January 12, 2025
ఛాంపియన్స్ ట్రోఫీకి బంగ్లాదేశ్ జట్టు ఎంపిక
ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు బంగ్లాదేశ్ తమ జట్టును ప్రకటించింది. సీనియర్ ప్లేయర్లు షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్‌కు జట్టులో చోటు దక్కలేదు. జట్టు: నజ్ముల్ హొస్సేన్ శాంటో (C), సౌమ్య సర్కార్, తంజిద్ హసన్, తౌహిద్ హృదోయ్, ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా, జాకీర్ అలీ, మెహిదీ హసన్ మిరాజ్, రిషద్ హొస్సేన్, టస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్, పర్వేజ్ హొస్సేన్, నసుమ్ అహ్మద్, హసన్ షకీబ్, నహీద్ రాణా
News January 12, 2025
కుంభమేళా వెనుక కథ ఏంటంటే..
కుంభమేళా గురించిన తొలి ప్రస్తావన రుగ్వేదంలో వచ్చింది. క్షీరసాగర మథనంలో ఉద్భవించిన అమృత కుంభం నుంచి నాలుగు చుక్కలు ప్రయాగరాజ్, హరిద్వార్, నాసిక్, ఉజ్జయిని నగరాల్లో పడ్డాయని ప్రతీతి. ఆ పవిత్రతను పురస్కరించుకుని నగరాల్లోని నదుల్లో 12ఏళ్లకోసారి జరిపే వేడుకే కుంభమేళా. త్రివేణీ సంగమంలో రేపటి నుంచి 45 రోజుల పాటు ఈ అద్భుత కార్యక్రమం ఆవిష్కృతం కానుంది. కోట్ల సంఖ్యలో భక్తులు పోటెత్తనున్నారని అంచనా.
News January 12, 2025
కుక్క బర్త్ డే కోసం రూ.5లక్షలు ఖర్చు!
పెంపుడు కుక్కలను సొంత పిల్లల్లాగా చూసుకునే వారి సంఖ్య పెరిగిపోయింది. కొందరు వాటికి పుట్టినరోజులు, సీమంతాలు కూడా చేస్తుంటారు. తాజాగా ఝార్ఖండ్‌కు చెందిన సప్నా అనే మహిళ తన కుక్క బర్త్ డే కోసం రూ.5 లక్షలు ఖర్చు చేసి వార్తల్లో నిలిచారు. వేడుక కోసం రూ.40వేల ఖరీదైన స్పెషల్ కేక్‌ను ఏర్పాటు చేయగా 300 మందికి ఆతిథ్యాన్ని అందించడం విశేషం.