News January 12, 2025
విటమిన్-డి లభించే ఆహారమిదే..

శరీరంలో రోగనిరోధక శక్తి కోసం విటమిన్-డి చాలా అవసరం. ఉరుకుల పరుగుల జీవితంలో ఎండలోకి వెళ్లక కొందరిలో విటమిన్-డి లోపం ఏర్పడుతుంది. అలాంటి వారు విటమిన్-డి లభించే ఆహారం తీసుకోవడం వల్ల దానిని అధిగమించవచ్చు. పుట్ట గొడుగులు, గుడ్డు పచ్చసొన, ఆరెంజ్ జ్యూస్, సాల్మన్ చేప, పాల ఉత్పత్తులు, పొద్దుతిరుగుడు గింజలు, నెయ్యి వంటివి తీసుకుంటే శరీరానికి మేలు చేస్తాయి.
Similar News
News October 29, 2025
వికారాబాద్ జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి- స్పీకర్

తుఫాను ప్రభావంతో వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ సూచించారు. వాగులు, కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని, రైతులు పొలాల వద్దకు వెళ్లరాదని తెలిపారు. ప్రజలు అనవసరంగా బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
News October 29, 2025
ఆవు పాల అభిషేకంతో కష్టాల నుంచి విముక్తి

కార్తీక మాసంలో శివారాధన గొప్ప ఫలితాలనిస్తుందని మనకు తెలిసిందే. అందుకే చాలామంది శివాలయాలకు వెళ్లి శివలింగాలకు అభిషేకాలు చేస్తుంటారు. అయితే శివుడికి ఆవు పాలతో అభిషేకం చేయడం అత్యంత పవిత్రమని పండితులు సూచిస్తున్నారు. ఈ అభిషేకం ద్వారా కష్టాలు తొలగిపోతాయని అంటున్నారు. ‘గోమాత పాలు శుభాలకు, పవిత్రతకు చిహ్నం. ఈ అభిషేకం వల్ల శివుడు సంతృప్తి చెంది, జీవితంలో సుఖశాంతులు నెలకొనేలా ఆశీర్వదిస్తాడు’ అంటున్నారు.
News October 29, 2025
బీర, కాకరకాయలను ఎప్పుడు కోస్తే మంచిది?

బీరకాయలు రకాన్ని బట్టి 60 నుంచి 90 రోజులలో కోతకు వస్తాయి. కాయలు లేతగా ఉన్నప్పుడే కోయాలి. కాయలను ముదిరిపోకుండా 2 నుంచి 3 రోజుల వ్యవధిలోనే కోయాలి. కాయలు ముదిరితే పీచు పదార్ధం ఎక్కువై మార్కెట్‌కి పనికి రాకుండా పోతాయి. కాయలను ఒక అంగుళం కాడతో సహా కోయాలి. కాకర పంట నాటిన 60-70 రోజులకు కోతకు వస్తుంది. కాయలను లేతగా ఉన్నప్పుడు, 3-4 రోజుల వ్యవధిలో కోయాలి. దీని వల్ల దిగుబడి పెరిగి మంచి ధర వస్తుంది.


