News January 12, 2025
రిటైర్ అవ్వాలనుకుని.. వెనక్కి తగ్గిన రోహిత్?
టీమ్ ఇండియా టెస్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియా పర్యటనలో రిటైర్ కావాలని భావించారని హిందుస్థాన్ టైమ్స్ ఓ కథనంలో తెలిపింది. దాని ప్రకారం.. మెల్‌బోర్న్ టెస్టు ప్రదర్శన అనంతరం టెస్టుల నుంచి తప్పుకోవాలని రోహిత్ అనుకున్నారు. కానీ సన్నిహితులు, శ్రేయోభిలాషులు ఒత్తిడి చేయడంతో ఆ నిర్ణయాన్ని పక్కన పెట్టారు. ఆయన మనసు మార్చుకోవడాన్ని కోచ్ గంభీర్ హర్షించకపోవడంతో ఆఖరి టెస్టుకు శర్మ వైదొలగినట్లు తెలుస్తోంది.
Similar News
News January 12, 2025
‘డాకు మహారాజ్’ వచ్చేది ఈ OTTలోనే!
నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ సినిమా ఈరోజు థియేటర్లలో రిలీజవగా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. థియేటర్లలో సినిమాను ఎక్స్‌పీరియన్స్ చేసేందుకు అభిమానులు క్యూ కడుతున్నారు. ఇదిలా ఉండగా ఈ చిత్ర ఓటీటీ హక్కులను ‘నెట్‌ఫ్లిక్స్’ దక్కించుకుంది. అయితే, 4 నుంచి 8 వారాల్లో ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని సినీవర్గాలు పేర్కొన్నాయి.
News January 12, 2025
యువీ తర్వాత 6 సిక్సులు కొట్టగలిగేది అతడే: బంగర్
యువరాజ్ సింగ్ తరహాలో ఆరు బంతులకు ఆరు సిక్సులు కొట్టే సామర్థ్యం సంజూ శాంసన్‌కు ఉందని మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ అభిప్రాయపడ్డారు. ‘ప్రస్తుతం సంజూకు దక్కుతున్న సక్సెస్ చూస్తే సంతోషంగా ఉంది. దీని కోసం అతడు చాలాకాలంగా ఎదురుచూశాడు. సరైన సమయంలో చక్కటి అవకాశాలు దక్కాయి. ఓపెనర్ కాబట్టి అతడు స్వేచ్ఛగా ఆడుకోవచ్చు. యువీ తర్వాత 6 బంతుల్లో 6 సిక్సులు కొట్టే సామర్థ్యం సంజూకే ఉంది’ అని పేర్కొన్నారు.
News January 12, 2025
ఐఫోన్ తర్వాత యాపిల్ కొత్తగా ఏం తీసుకురాలేదు: జుకర్‌బర్గ్
టెక్ దిగ్గజం యాపిల్‌పై మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ విమర్శలు గుప్పించారు. ఆ సంస్థ ఆవిష్కరణ సామర్థ్యాన్ని కోల్పోయిందని తేల్చిచెప్పారు. ‘ఐఫోన్ అద్భుతమే. సగానికి పైగా ప్రపంచం ఆ ఫోన్లను వాడుతోంది. కానీ ఆ తర్వాత వేరే ఆవిష్కరణను యాపిల్ తీసుకురాలేకపోయింది. స్టీవ్ జాబ్స్ కనిపెట్టిన ఉత్పత్తిపైనే 20 ఏళ్లుగా ఆ కంపెనీ బతుకుతోంది. ప్రజల్ని పీల్చి పిప్పి చేసి లాభాలు దండుకుంటోంది’ అని పేర్కొన్నారు.