News January 12, 2025
మనిషి ఆయుష్షును పెంచిన తెలుగోడు ఎల్లాప్రగడ సుబ్బారావు
నేడు మనిషి జీవన ప్రమాణం మెరుగుపడిందంటే అందుకు కారణం మన తెలుగువాడు ఎల్లాప్రగడ సుబ్బారావు. APలోని భీమవరంలో 1895, జనవరి 12న ఆయన జన్మించారు. బోదకాలుకు ఔషధం హెట్రోజన్, యాంటీబయాటిక్ టెట్రాసైక్లిన్, క్షయను కట్టడి చేసే ఐసోనికోటినిక్ యాసిడ్ హైడ్రాజైడ్, క్యాన్సర్ చికిత్సలో ఉపకరించిన మెథోట్రెక్సేట్.. ఇలా ఎన్నో ఔషధాలతో మానవాళిని రక్షించిన ఆయన 1948, ఆగస్టు 9న కన్నుమూశారు. నేడు ఆ మహనీయుడి జయంతి.
Similar News
News January 12, 2025
కుంభమేళా వెనుక కథ ఏంటంటే..
కుంభమేళా గురించిన తొలి ప్రస్తావన రుగ్వేదంలో వచ్చింది. క్షీరసాగర మథనంలో ఉద్భవించిన అమృత కుంభం నుంచి నాలుగు చుక్కలు ప్రయాగరాజ్, హరిద్వార్, నాసిక్, ఉజ్జయిని నగరాల్లో పడ్డాయని ప్రతీతి. ఆ పవిత్రతను పురస్కరించుకుని నగరాల్లోని నదుల్లో 12ఏళ్లకోసారి జరిపే వేడుకే కుంభమేళా. త్రివేణీ సంగమంలో రేపటి నుంచి 45 రోజుల పాటు ఈ అద్భుత కార్యక్రమం ఆవిష్కృతం కానుంది. కోట్ల సంఖ్యలో భక్తులు పోటెత్తనున్నారని అంచనా.
News January 12, 2025
కుక్క బర్త్ డే కోసం రూ.5లక్షలు ఖర్చు!
పెంపుడు కుక్కలను సొంత పిల్లల్లాగా చూసుకునే వారి సంఖ్య పెరిగిపోయింది. కొందరు వాటికి పుట్టినరోజులు, సీమంతాలు కూడా చేస్తుంటారు. తాజాగా ఝార్ఖండ్కు చెందిన సప్నా అనే మహిళ తన కుక్క బర్త్ డే కోసం రూ.5 లక్షలు ఖర్చు చేసి వార్తల్లో నిలిచారు. వేడుక కోసం రూ.40వేల ఖరీదైన స్పెషల్ కేక్ను ఏర్పాటు చేయగా 300 మందికి ఆతిథ్యాన్ని అందించడం విశేషం.
News January 12, 2025
మళ్లీ విద్యార్థి రాజకీయాలు రావాలి: సీఎం
TG: విద్యార్థి దశలో సిద్ధాంతపరమైన భావజాలం తగ్గిపోవడం వల్లే పార్టీ ఫిరాయింపులు పెరిగాయని సీఎం రేవంత్ అన్నారు. రాష్ట్రంలో మళ్లీ విద్యార్థి రాజకీయాలు రావాలని అభిప్రాయపడ్డారు. తమిళనాడులో అన్ని పార్టీలు ఏకమై రాష్ట్రం కోసం పని చేస్తాయని, తెలంగాణలోనూ ఆ సంప్రదాయం రావాలని తెలిపారు. మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ఆత్మకథ ‘ఉనిక’ పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు.