News January 12, 2025
కొనిజర్ల: లారీని, బస్సును ఢీ కొట్టిన మరో లారీ
ఖమ్మం జిల్లా కొనిజర్ల సమీపంలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీని, ట్రావెల్ బస్సును మరో లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రెండు లారీల డ్రైవర్లకు గాయాలయ్యాయి. ట్రావెల్ బస్సు డ్రైవర్ చాకచక్యంతో వ్యవహరించడంతో 56 మంది ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. ప్రయాణికులను వేరే బస్సులో తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 5, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు
∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
∆} ఖమ్మం నగరంలో మంత్రి తుమ్మల పర్యటన
∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన
∆} జమలాపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన
∆} కారేపల్లి రైల్వే గేట్ మూసివేత
∆} మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
News February 5, 2025
ఖమ్మంలో రూ.116 కోట్ల ధాన్యం కొనుగోళ్లు: కొత్వాల
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో DCMS ద్వారా 2024-25 వానాకాలంలో 4.13 లక్షల క్వింటాళ్ల వరి ధాన్యానికి రూ.116.49 కోట్లు చెల్లించామని రాష్ట్ర మార్క్‌ఫెడ్ డైరెక్టర్, DCMS ఛైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. ధాన్యం కొనుగోలు వివరాలను ఆయన వెల్లడించారు. భద్రాద్రి జిల్లాలో 94 వేల క్వింటాళ్లకు గాను రూ.26.78 కోట్లు, ఖమ్మం జిల్లాలో 3.19 లక్షల క్వింటాళ్లకు గాను సుమారు రూ.90 కోట్లను చెల్లించినట్లు వెల్లడించారు.
News February 5, 2025
వెనుకబడిన ఎన్ని జిల్లాలను కేంద్రం గుర్తించింది: ఖమ్మం ఎంపీ
విద్యాపరంగా వెనుకబడిన జిల్లాల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు, విద్యాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతోందని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి లోక్‌సభలో ప్రశ్నించారు. గత ఐదేళ్లలో విద్యాపరంగా వెనుకబడిన ఎన్ని జిల్లాలను గుర్తించారని, తాజా జనాభా లెక్కల ప్రకారం ఆయా జిల్లాల్లో SC,ST నిష్పత్తి ఏ విధంగా ఉందని అడిగారు. దీనికి కేంద్ర సహాయ మంత్రి జయంత్ ఎంపీకి లిఖితపూర్వక సమాధానమిచ్చారు.