News January 12, 2025
$94,500 వద్దే చలిస్తున్న BITCOIN

క్రిప్టో మార్కెట్లు గత 24 గంటల్లో పుంజుకున్నాయి. మార్కెట్ విలువ 1.20% పెరిగి $3.32Tకి చేరుకుంది. రేంజుబౌండ్లో చలించిన బిట్‌కాయిన్ $126 తగ్గి $94,599 వద్ద ముగిసింది. ప్రస్తుతం $94,597 వద్ద కొనసాగుతోంది. డామినెన్స్ 56.5 శాతంగా ఉంది. ఎథీరియం 1.14% పెరిగి $3279 వద్ద ట్రేడవుతోంది. మార్కెట్ డామినెన్స్ 11.9 శాతంగా ఉంది. XRP 8.98, BNB 0.44, SOL 0.74, DOGE 3.44, ADA 10, AVAX 2.26 శాతం లాభపడ్డాయి.
Similar News
News November 5, 2025
సిగ్నల్ జంప్ వల్లే రైలు ప్రమాదం!

ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పుర్ రైల్వే స్టేషన్ సమీపంలో <<18197940>>రైలు ప్రమాదం<<>> జరిగిన విషయం తెలిసిందే. ప్రయాణికుల రైలు బోగీ గూడ్స్ రైలు పైకి ఎక్కడం ప్రమాద తీవ్రతను పెంచింది. ప్యాసింజర్ రైలు రెడ్ సిగ్నల్ జంప్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు రైల్వేబోర్డు ప్రాథమికంగా అంచనా వేసింది. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.5 లక్షలు, స్వల్ప గాయాలైన వారికి రూ.లక్ష చొప్పున పరిహారం ప్రకటించింది.
News November 5, 2025
కార్తీక పౌర్ణమి ఎందుకు జరుపుతారు?

పరమేశ్వరుడి కీర్తిని విని ద్వేషంతో రగిలిపోయిన త్రిపురాసురుడు కైలాసంపైకి దండయాత్రకు వెళ్లాడు. మూడ్రోజుల భీకర పోరాటం తర్వాత ఈశ్వరుడు ఆ అసురుడిని సంహరించాడు. దీంతో వేయి సంవత్సరాల పాటు సాగిన అసుర పాలన అంతమైంది. దేవతల భయం కూడా తొలగిపోయింది. దీంతో అభయంకరుడైన శివుడు ఆనందోత్సాహాలతో తాండవం చేశాడు. ఈ ఘట్టం జరిగింది కార్తీక పౌర్ణమి నాడే కాబట్టి.. ప్రతి సంవత్సరం ఈ శుభదినాన శివుడిని అత్యంత భక్తితో పూజిస్తాము.
News November 5, 2025
ఫుట్‌బాల్‌కు వీడ్కోలు పలుకుతా: రొనాల్డో

త్వరలోనే తాను రిటైర్మెంట్ ప్రకటించబోతున్నట్లు పోర్చుగల్ ఫుట్‌బాల్ లెజెండ్ క్రిస్టియానో రొనాల్డో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘ఇది నిజంగానే కష్టంగా ఉంటుంది. నేను కచ్చితంగా ఏడ్చేస్తాను. 25 ఏళ్ల వయసు నుంచే నేను నా ఫ్యూచర్ ప్లాన్ రెడీ చేసుకున్నాను. నాకు వేరే ప్యాషన్స్ ఉన్నాయి. కాబట్టి పెద్దగా బోర్ కొట్టకపోవచ్చు. రిటైర్మెంట్ తర్వాత నా కోసం, నా పిల్లల కోసం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తాను’ అని తెలిపారు.


