News January 12, 2025
‘డాకు మహారాజ్’ రివ్యూ & రేటింగ్

‘చంబల్’ నీటి కష్టాలు తీర్చేందుకు ఓ చీఫ్ ఇంజినీర్ ‘డాకు మహారాజ్’లా ఎలా మారాడనేదే ఈ సినిమా స్టోరీ. బాలయ్య క్యారెక్టర్ మేకోవర్, యాక్షన్ సీన్లు, తమన్ BGM గూస్‌బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఇంటర్వెల్ ముందు 20 ని.లు హైలైట్. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ స్లో అవుతుంది. ఎమోషన్లకు పెద్దపీట వేసి, మాస్ ఎలివేషన్లను తగ్గించారు. క్లైమాక్స్ ముందే ఊహించేలా ఉండటం మైనస్.
RATING: 2.75/5
Similar News
News September 5, 2025
రేపు ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకోనున్న సీఎం

TG: సీఎం రేవంత్ రెడ్డి రేపు ఖైరతాబాద్ వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు మహాగణపతిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆయన వెంట పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్, మంత్రులు పొన్నం, సురేఖ కూడా వెళ్తారు. కాగా శనివారం మహాగణపతిని హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయనున్నారు. దీంతో ముందస్తు ఏర్పాట్ల నిమిత్తం ఇవాళ రాత్రి 12 గంటల నుంచే భక్తుల దర్శనాలను నిలిపివేయనున్నారు.
News September 5, 2025
నేపాల్‌లో సోషల్ మీడియా యాప్స్‌పై బ్యాన్

నేపాల్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, X, రెడిట్, లింక్డ్‌ఇన్ వంటి సోషల్ మీడియా యాప్స్‌ను బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం ఇవాళ రాత్రి నుంచే అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఐటీ చట్టాల నిబంధనలను పాటించడంతో విఫలం కావడమే నిషేధానికి కారణమని వెల్లడించింది. అయితే దీనిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
News September 5, 2025
చెవిరెడ్డి ఇంట్లో ముగిసిన సోదాలు

AP: లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి తిరుపతి సమీపంలోని తుమ్మలగుంటలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంట్లో సోదాలు ముగిశాయి. ‘సిట్ అధికారుల ఆదేశాలతో చెవిరెడ్డి ఇంట్లో తనిఖీలు చేశాం. కంపెనీల వివరాలు, పలు రికార్డులను స్వాధీనం చేసుకుంటున్నాం. వాటిని విచారణ కోసం సిట్‌కు పంపుతాం. 6 కంపెనీలకు సంబంధించిన వివరాలు ఇచ్చారు. చెవిరెడ్డి కుటుంబ సభ్యులు ఇచ్చిన కంపెనీల వివరాలు పరిశీలించాం’ అని విజిలెన్స్ ఎస్పీ తెలిపారు.