News January 12, 2025

కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన

image

TG: కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకంపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. వీటి కోసం జనవరి 16 నుంచి 20 వరకు ఫీల్డ్ వెరిఫికేషన్ జరుగుతుందన్నారు. లబ్ధిదారుల ముసాయిదా జాబితాను 21 నుంచి 24 వరకు గ్రామ, వార్డు సభల్లో పెట్టి ప్రజాభిప్రాయం తీసుకుంటామని చెప్పారు. 26 నుంచి కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు పంపిణీ చేస్తామని తెలిపారు. రేషన్ కార్డులకు గత నిబంధనలే వర్తిస్తాయని స్పష్టం చేశారు.

Similar News

News January 12, 2025

హెల్మెట్ లేని వారికి పెట్రోల్ పోయొద్దు: UP ప్రభుత్వం

image

రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్యను తగ్గించేందుకు ‘నో హెల్మెట్-నో ఫ్యూయెల్’ విధానాన్ని అమలు చేయాలని UP ప్రభుత్వం నిర్ణయించింది. హెల్మెట్ ధరించని వారికి పెట్రోల్ పోయవద్దని బంకులను ఆదేశించింది. పిలియన్ రైడర్ సైతం హెల్మెట్ ధరించాలని పేర్కొంది. ఈ రూల్స్‌ను కఠినంగా అమలు చేయాలని అన్ని జిల్లాలను ఆదేశించింది. ఏటా రోడ్డు ప్రమాదాల వల్ల UPలో 25,000-26,000 మంది చనిపోతున్నట్లు ఇటీవల CM యోగి తెలిపారు.

News January 12, 2025

భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం

image

ఐర్లాండ్‌ మహిళల టీమ్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ 116 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మరో వన్డే మిగిలి ఉండగానే స్మృతి మంధాన సేన 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. తొలుత 370/5 స్కోర్ చేసిన టీమ్ ఇండియా ప్రత్యర్థిని 254/7 స్కోరుకే పరిమితం చేసింది. దీప్తి శర్మ 3, ప్రియా మిశ్రా 2, టిటాస్, సయాలి చెరో వికెట్ తీశారు. బ్యాటింగ్‌లో జెమీమా(102), హర్లీన్(89), స్మృతి(73), ప్రతికా రావల్(67) రాణించారు.

News January 12, 2025

సంపద మొత్తం ట్రస్టుకు రాసిచ్చిన వారెన్ బఫెట్!

image

కలియుగ దానకర్ణుడు, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన వారెన్ బఫెట్ తన సంపదను ఓ ఛారిటబుల్ ట్రస్టుకు రాసిచ్చారని తెలిసింది. ఆయన వారసులు సూసీ, హువీ, పీటర్ బఫెట్ దీనిని నిర్వహిస్తారు. నిధులు ఖర్చు చేయాలంటే వీరంతా కలిసే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.. తాము లక్కీ అని, పరులకు సాయం చేసేందుకు అనేక మార్గాలు ఉన్నాయని బఫెట్ అన్నారు. 2006 నుంచి $39B గేట్స్ ఫౌండేషన్‌కు దానం చేసిన ఆయన ఇకపై ఒక్క $ వారికి ఇవ్వనని చెప్పారు.