News January 12, 2025
LOS ANGELES: కార్చిచ్చు ఆర్పేందుకు నీళ్లూ కరవు..!
లాస్ ఏంజెలిస్‌లో కార్చిచ్చు మరింత ఉద్ధృతమవుతోంది. నగరం వైపుగా భీకర గాలులు వీస్తుండటంతో మంటలు ఒక చోట నుంచి మరో చోటుకు వ్యాపిస్తున్నాయి. మంటలు ఆర్పేందుకు అక్కడ తీవ్ర నీటి కొరత ఏర్పడింది. కొన్ని చోట్ల అధికారులు ట్యాంకర్లతో నీటిని తరలించి మంటలు అదుపు చేస్తున్నారు. కాగా కొందరు హాలీవుడ్ స్టార్లు వారికి కేటాయించిన దానికంటే అదనంగా నీటిని వాడుకుని గార్డెన్లు పెంచుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
Similar News
News January 12, 2025
సంపద మొత్తం ట్రస్టుకు రాసిచ్చిన వారెన్ బఫెట్!
కలియుగ దానకర్ణుడు, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన వారెన్ బఫెట్ తన సంపదను ఓ ఛారిటబుల్ ట్రస్టుకు రాసిచ్చారని తెలిసింది. ఆయన వారసులు సూసీ, హువీ, పీటర్ బఫెట్ దీనిని నిర్వహిస్తారు. నిధులు ఖర్చు చేయాలంటే వీరంతా కలిసే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.. తాము లక్కీ అని, పరులకు సాయం చేసేందుకు అనేక మార్గాలు ఉన్నాయని బఫెట్ అన్నారు. 2006 నుంచి $39B గేట్స్ ఫౌండేషన్‌కు దానం చేసిన ఆయన ఇకపై ఒక్క $ వారికి ఇవ్వనని చెప్పారు.
News January 12, 2025
మానవత్వం చాటుకున్న హోంమంత్రి అనిత
AP: హోంమంత్రి అనిత మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితులకు సహాయం చేశారు. విశాఖపట్నంలోని పాత గాజువాక జంక్షన్లో అనిత కారులో వెళ్తున్నారు. అదే సమయంలో ఓ బైక్‌ను ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ చిన్నారి గాయపడింది. వెంటనే ఆమె తన సిబ్బందిని ఆదేశించి ఆస్పత్రికి పంపించారు. ఇది చూసిన స్థానికులు మంత్రిని అభినందిస్తున్నారు.
News January 12, 2025
10th బాలికలను షర్ట్స్ లేకుండా ఇంటికి పంపిన ప్రిన్సిపల్: BJP ఫైర్
షర్ట్స్ విప్పించి 80 మంది 10th బాలికలను ఇన్నర్స్, బ్లేజర్స్‌తో ఇంటికి పంపిన ప్రిన్సిపల్‌పై చర్యలు తీసుకోవాలని ఝార్ఖండ్ BJP డిమాండ్ చేసింది. పేరెంట్స్ ఫిర్యాదు చేసినా సెలవులని పోలీసులు పట్టించుకోకపోవడం దారుణమంది. పెన్డే కావడంతో ధన్‌బాద్‌లోని ఓ Pvt స్కూల్ బాలికలు షర్ట్స్పై సందేశాలు రాయించుకోవడంతో ఆగ్రహించిన ప్రిన్సిపల్ దేవశ్రీ వాటిని విప్పించారు. వివాదం కావడంతో Govt దర్యాప్తు కమిటీని వేసింది.