News January 12, 2025

కేటీఆర్‌ను నేనేం పొగడలేదు: దానం

image

TG: <<15124836>>తాను కేటీఆర్‌ను పొగిడానంటూ<<>> వచ్చిన వార్తలపై దానం నాగేందర్ స్పందించారు. ‘హైదరాబాద్ ఇమేజ్‌ను చంద్రబాబు, వైఎస్ పెంచారు. బీఆర్ఎస్, కేటీఆర్ నగరానికి చేసిందేం లేదు. హైడ్రా విషయంలో నా మాట మీదే ఉన్నా. దాని వల్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ఆ విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలి. ఫార్ములా-ఈ కారు రేసుతో హైదరాబాద్ ఇమేజ్ పెరిగింది. అలా అని నేను కేటీఆర్‌కు క్లీన్ సర్టిఫికెటేం ఇవ్వడం లేదు’ అని తెలిపారు.

Similar News

News January 12, 2026

సూర్యాపేట: కంటతడి పెట్టించిన దృశ్యం

image

ఆ చిన్నారికి లోకమే తెలియదు.. ఆకలి తీర్చే అమ్మమ్మే సర్వస్వం. కానీ, విధి ఆ బాలుడిని అనాథను చేసింది. ఖమ్మం రైల్వే స్టేషన్‌లో కోదాడకు చెందిన యాచకురాలు లక్ష్మి శనివారం రాత్రి నిద్రలో మృతి చెందింది. నిద్రలేచిన మనవడు కిట్టు, అమ్మమ్మ విగతజీవిగా పడి ఉండటం చూసి తల్లడిల్లిపోయాడు. మృతదేహం వద్ద బాలుడు రోదిస్తున్న తీరు స్థానికులను కంటతడి పెట్టించింది.

News January 12, 2026

జంతికలు కరకరలాడుతూ రావాలంటే?

image

జంతికలు కరకరలాడాలంటే కప్పు బియ్యప్పిండికి రెండు కప్పుల సెనగపిండి తీసుకుని గోరువెచ్చని నీళ్లతో కలపాలి. పిండిలో వాము, వెన్న వేయాలి. గట్టిగా, మరీ జారుగా కాకుండా కలపాలి. అలాగే ముద్ద కలిపిన తర్వాత తడి వస్త్రంతో పైన కప్పేయాలి. 15 నిమిషాల తర్వాతే ఆ పిండిని వాడాలి. అలాగే వేయించేటప్పుడు జంతికలని ఎక్కువ సేపు నూనెలో ఉంచొద్దు. అలా ఉంచితే జంతికలు గట్టిగా ఉంటాయి. రంగుమారగానే జంతికల్ని బయటకు తీసేయాలి.

News January 12, 2026

శివారాధనలో ‘3’ అంకె విశిష్టత

image

శివారాధనలో 3 అంకెకు విశిష్ట స్థానం ఉంది. శివుని త్రిశూలం సత్వ, రజో, తమో గుణాలకు చిహ్నం. ఆయనకెంతో ఇష్టమైన బిల్వదళంలోని 3 పత్రాలు త్రిమూర్తులకు ప్రతీకలు. మూడో నేత్రం జ్ఞానం, అంతర్దృష్టిని సూచిస్తుంది. త్రిపుండ్రాలు భౌతిక, ఆధ్యాత్మిక, అతీంద్రియ శక్తులకు సంకేతాలు. శివలింగాన్ని దర్శిస్తే ముల్లోకాలు దర్శించినట్లే! శివానుగ్రహం కోసం మారేడు దళాల నోము ఎలా చేయాలో తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.