News January 12, 2025
బాధితులకు టీటీడీ చెక్కుల పంపిణీ
AP: తిరుపతి తొక్కిసలాట మృతుల కుటుంబాలకు టీటీడీ నష్టపరిహారం అందజేసింది. ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన 4 కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేసింది. లావణ్య, రజనీ, శాంతి కుటుంబసభ్యులకు రూ.25 లక్షలు అందించింది. అలాగే మృతుల కుటుంబాల్లో ఒకరికి టీటీడీలో కాంట్రాక్టు ఉద్యోగం కల్పించనుంది. మృతుల పిల్లలకు ఉచిత విద్య అందించనుంది.
Similar News
News January 12, 2025
భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
ఐర్లాండ్ మహిళల టీమ్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ 116 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మరో వన్డే మిగిలి ఉండగానే స్మృతి మంధాన సేన 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. తొలుత 370/5 స్కోర్ చేసిన టీమ్ ఇండియా ప్రత్యర్థిని 254/7 స్కోరుకే పరిమితం చేసింది. దీప్తి శర్మ 3, ప్రియా మిశ్రా 2, టిటాస్, సయాలి చెరో వికెట్ తీశారు. బ్యాటింగ్‌లో జెమీమా(102), హర్లీన్(89), స్మృతి(73), ప్రతికా రావల్(67) రాణించారు.
News January 12, 2025
సంపద మొత్తం ట్రస్టుకు రాసిచ్చిన వారెన్ బఫెట్!
కలియుగ దానకర్ణుడు, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన వారెన్ బఫెట్ తన సంపదను ఓ ఛారిటబుల్ ట్రస్టుకు రాసిచ్చారని తెలిసింది. ఆయన వారసులు సూసీ, హువీ, పీటర్ బఫెట్ దీనిని నిర్వహిస్తారు. నిధులు ఖర్చు చేయాలంటే వీరంతా కలిసే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.. తాము లక్కీ అని, పరులకు సాయం చేసేందుకు అనేక మార్గాలు ఉన్నాయని బఫెట్ అన్నారు. 2006 నుంచి $39B గేట్స్ ఫౌండేషన్‌కు దానం చేసిన ఆయన ఇకపై ఒక్క $ వారికి ఇవ్వనని చెప్పారు.
News January 12, 2025
మానవత్వం చాటుకున్న హోంమంత్రి అనిత
AP: హోంమంత్రి అనిత మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితులకు సహాయం చేశారు. విశాఖపట్నంలోని పాత గాజువాక జంక్షన్లో అనిత కారులో వెళ్తున్నారు. అదే సమయంలో ఓ బైక్‌ను ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ చిన్నారి గాయపడింది. వెంటనే ఆమె తన సిబ్బందిని ఆదేశించి ఆస్పత్రికి పంపించారు. ఇది చూసిన స్థానికులు మంత్రిని అభినందిస్తున్నారు.