News January 12, 2025

కుంభమేళా వెనుక కథ ఏంటంటే..

image

కుంభమేళా గురించిన తొలి ప్రస్తావన రుగ్వేదంలో వచ్చింది. క్షీరసాగర మథనంలో ఉద్భవించిన అమృత కుంభం నుంచి నాలుగు చుక్కలు ప్రయాగరాజ్, హరిద్వార్, నాసిక్, ఉజ్జయిని నగరాల్లో పడ్డాయని ప్రతీతి. ఆ పవిత్రతను పురస్కరించుకుని నగరాల్లోని నదుల్లో 12ఏళ్లకోసారి జరిపే వేడుకే కుంభమేళా. త్రివేణీ సంగమంలో రేపటి నుంచి 45 రోజుల పాటు ఈ అద్భుత కార్యక్రమం ఆవిష్కృతం కానుంది. కోట్ల సంఖ్యలో భక్తులు పోటెత్తనున్నారని అంచనా.

Similar News

News January 12, 2025

ఫెన్సింగ్ టెన్షన్: భారత హైకమిషనర్‌కు బంగ్లా సమన్లు

image

భారత హైకమిషనర్ ప్రణయ్ వర్మకు బంగ్లాదేశ్ ఫారిన్ మినిస్ట్రీ సమన్లు పంపింది. సరిహద్దులోని 5 ప్రాంతాల్లో BSF ఫెన్సింగ్ నిర్మాణం, ఉద్రిక్తతలపై ఆరాతీసినట్టు సమాచారం. ఫారిన్ సెక్రటరీ జాషిమ్ ఉద్దీన్‌తో 3PMకు మొదలైన వర్మ మీటింగ్ 45ని. సాగినట్టు స్థానిక BSS న్యూస్ తెలిపింది. సరిహద్దు వెంట భద్రత, ఫెన్సింగ్‌, నేరాల కట్టడిపై రెండు దేశాలకు అవగాహనా ఒప్పందాలు ఉన్నాయని, పరస్పరం సహకరించుకుంటాయని వర్మ పేర్కొన్నారు.

News January 12, 2025

రేపు భోగి.. ఈ జాగ్రత్తలు తీసుకోండి

image

తెలుగు రాష్ట్రాల్లో రేపు భోగి వేడుకలు వైభవంగా జరగనున్నాయి. భోగి మంటల వద్ద పలు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. పెట్రోల్, డీజిల్ లాంటి మండే పదార్థాలను దూరంగా ఉంచాలి. మంట చుట్టూ చేరేవారు కాటన్ దుస్తులు ధరించాలి. శ్వాసకోశ, ఊపిరితిత్తుల సమస్యలున్నవారు, రోగులు, వృద్ధులు, చిన్నపిల్లలు మంటలకు దూరంగా ఉండాలి. ప్రమాదం జరిగినప్పుడు మంటలను ఆర్పడానికి వీలుగా దగ్గర్లో నీళ్లు, దుప్పట్లు ఉంచుకోవాలి.

News January 12, 2025

హెల్మెట్ లేని వారికి పెట్రోల్ పోయొద్దు: UP ప్రభుత్వం

image

రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్యను తగ్గించేందుకు ‘నో హెల్మెట్-నో ఫ్యూయెల్’ విధానాన్ని అమలు చేయాలని UP ప్రభుత్వం నిర్ణయించింది. హెల్మెట్ ధరించని వారికి పెట్రోల్ పోయవద్దని బంకులను ఆదేశించింది. పిలియన్ రైడర్ సైతం హెల్మెట్ ధరించాలని పేర్కొంది. ఈ రూల్స్‌ను కఠినంగా అమలు చేయాలని అన్ని జిల్లాలను ఆదేశించింది. ఏటా రోడ్డు ప్రమాదాల వల్ల UPలో 25,000-26,000 మంది చనిపోతున్నట్లు ఇటీవల CM యోగి తెలిపారు.