News January 12, 2025
యువీ తర్వాత 6 సిక్సులు కొట్టగలిగేది అతడే: బంగర్

యువరాజ్ సింగ్ తరహాలో ఆరు బంతులకు ఆరు సిక్సులు కొట్టే సామర్థ్యం సంజూ శాంసన్‌కు ఉందని మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ అభిప్రాయపడ్డారు. ‘ప్రస్తుతం సంజూకు దక్కుతున్న సక్సెస్ చూస్తే సంతోషంగా ఉంది. దీని కోసం అతడు చాలాకాలంగా ఎదురుచూశాడు. సరైన సమయంలో చక్కటి అవకాశాలు దక్కాయి. ఓపెనర్ కాబట్టి అతడు స్వేచ్ఛగా ఆడుకోవచ్చు. యువీ తర్వాత 6 బంతుల్లో 6 సిక్సులు కొట్టే సామర్థ్యం సంజూకే ఉంది’ అని పేర్కొన్నారు.
Similar News
News March 12, 2025
భైంసా: విద్యుత్ షాక్‌తో రైతు మృతి

భైంసా మండలం కోతుల్గాం గ్రామానికి చెందిన రైతు పాలబోయిన భోజన్న(62) మంగళవారం కరెంట్ షాక్‌తో మరణించినట్లు భైంసా గ్రామీణ సీఐ నైలు తెలిపారు. మొక్కజొన్న పంటకు నీరందించేందుకు వెళ్లి, ప్రమాదవశాత్తు పంటకు జంతువుల బారి నుంచి రక్షణగా ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెకు తగిలి ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు.
News March 12, 2025
పోసాని విడుదలకు బ్రేక్!

AP: వైసీపీ మద్దతుదారు పోసాని కృష్ణమురళి విడుదలకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. ఆయన కోసం గుంటూరు సీఐడీ పోలీసులు కర్నూలు జిల్లా జైలు వద్దకు వెళ్లి పీటీ వారెంట్ వేశారు. దీంతో ఆయన్ను వర్చువల్‌గా జడ్జి ముందు ప్రవేశపెట్టనున్నారు. కాగా, పోసానిపై నమోదైన కేసుల్లో బెయిల్ రాగా నేడు విడుదల అవుతారని వార్తలొచ్చాయి. తాజాగా సీఐడీ పీటీ వారెంట్ దాఖలుతో విడుదల నిలిచిపోనున్నట్లు సమాచారం.
News March 12, 2025
పాకిస్థాన్ క్రికెట్ ICUలో ఉంది: అఫ్రీది

సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే పాకిస్థాన్ క్రికెట్ ఇప్పుడు ICUలో ఉందని మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రీది అన్నారు. ‘PCB నిర్ణయాల్లో కంటిన్యుటీ, కన్సిస్టెన్సీ ఉండట్లేదు. తరచుగా కెప్టెన్, కోచ్‌లను మారుస్తున్నారు. కోచ్‌లు ప్లేయర్లను నిందించడం, మేనేజ్‌మెంట్ స్టాఫ్ తమ పదవుల్ని కాపాడుకునేందుకు కోచ్‌లు, ఆటగాళ్లను నిందించడం విచారకరం’ అని బోర్డు పని తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.