News January 12, 2025
గంటల కొద్దీ చూడటం నా భార్యకెంతో ఇష్టం: ‘కొవిషీల్డ్’ సీరమ్ అధిపతి
తన భార్యకూ తనను చూస్తూ ఉండిపోవడమంటే చాలా ఇష్టమని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ అధినేత అదార్ పూనావాలా అన్నారు. వారానికి 90 గంటల పని అంశంపై స్పందించారు. క్వాంటిటీ కన్నా క్వాలిటీ వర్క్‌కే ప్రాధాన్యం ఇవ్వాలన్న ఆనంద్ మహీంద్రాతో ఏకీభవించారు. ‘అవును మహీంద్రా. నా భార్య నటాషా కూడా నేనెంతో అద్భుతంగా ఉన్నానని అనుకుంటుంది. ఆదివారాలు నన్నలా చూస్తూ ఉండిపోవడం ఆమెకెంతో ఇష్టం. #worklifebalance’ అని ట్వీట్ చేశారు.
Similar News
News January 12, 2025
‘గేమ్ ఛేంజర్’ రెండు రోజుల కలెక్షన్లు ఎంతంటే?
‘గేమ్ ఛేంజర్’ మూవీకి రెండు రోజుల్లో రూ.270 కోట్ల కలెక్షన్లు వచ్చినట్లు అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లు వైరలవుతున్నాయి. దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది. తొలి రోజు రూ.186 కోట్లు వచ్చినట్లు నిర్మాతలు వెల్లడించారు. శంకర్ డైరెక్షన్‌లో రామ్ చరణ్, కియారా జంటగా నటించిన ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వస్తున్న విషయం తెలిసిందే.
News January 12, 2025
శరద్, ఉద్ధవ్ మోసపూరిత రాజకీయాలకు తెర: అమిత్ షా
NCP(SP) చీఫ్ శరద్ పవార్ మహారాష్ట్ర వేదికగా 1978 నుంచి మోసపూరిత రాజకీయాలు చేస్తున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. సీఎంగా, కేంద్ర వ్యవసాయ మంత్రిగా పనిచేసినప్పటికీ ఆయన రైతు ఆత్మహత్యలను ఆపలేకపోయారని దుయ్యబట్టారు. పవార్ విధానాలతోపాటు ఉద్ధవ్ ఠాక్రే కుటుంబ, ద్రోహ రాజకీయాలకు 2024లో బీజేపీ విజయంతో తెరపడిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో శరద్, ఉద్ధవ్‌ల స్థానమేంటో ప్రజలు చూపించారని తెలిపారు.
News January 12, 2025
50% రాయితీపై పెట్రోల్.. వారికి మాత్రమే!
AP: స్వయం ఉపాధి పొందుతున్న లేదా ప్రైవేట్ జాబ్ చేస్తున్న దివ్యాంగులకు ప్రభుత్వం 50% సబ్సిడీపై పెట్రోల్, డీజిల్ అందించనుంది. లబ్ధిదారులు 3 టైర్ల మోటరైజ్డ్ వెహికల్స్ కలిగి ఉండాలి. సంక్షేమ శాఖ ఆఫీసుల్లో ఈనెల 31లోపు దరఖాస్తు చేసుకోవాలి. 2HP వాహనాలకు నెలకు 15 లీటర్ల వరకు, అంతకన్నా ఎక్కువ సామర్థ్యమున్న వాహనాలకు నెలకు 25 లీటర్ల వరకు రాయితీ లభిస్తుంది. బిల్లులు సమర్పిస్తే బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు వేస్తారు.