News January 12, 2025

BJP దూకుడు: మహిళలకు పగ్గాలిచ్చేందుకు రెడీ

image

డీలిమిటేషన్ ప్రాసెస్ మొదలయ్యే సరికి మహిళా నాయకత్వాన్ని పెంచుకొనేందుకు BJP కసరత్తు ఆరంభించింది. బూత్ లెవల్ నుంచి నేషనల్ వరకు పార్టీ పగ్గాలను సముచిత స్థాయిలో వారికే అప్పగించనుందని తెలిసింది. నడ్డా స్థానంలో BJPకి కొత్త ప్రెసిడెంట్ వచ్చేలోపు states, dists, mandals, village స్థాయుల్లో 30% వరకు స్త్రీలకే బాధ్యతలు అప్పగించనుంది. MPని మోడల్ స్టేట్‌గా ఎంచుకుంది. 2026 నుంచి విమెన్ రిజర్వేషన్లు అమలవుతాయి.

Similar News

News January 12, 2025

‘గేమ్ ఛేంజర్’ రెండు రోజుల కలెక్షన్లు ఎంతంటే?

image

‘గేమ్ ఛేంజర్’ మూవీకి రెండు రోజుల్లో రూ.270 కోట్ల కలెక్షన్లు వచ్చినట్లు అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లు వైరలవుతున్నాయి. దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది. తొలి రోజు రూ.186 కోట్లు వచ్చినట్లు నిర్మాతలు వెల్లడించారు. శంకర్ డైరెక్షన్‌లో రామ్ చరణ్, కియారా జంటగా నటించిన ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వస్తున్న విషయం తెలిసిందే.

News January 12, 2025

శరద్, ఉద్ధవ్ మోసపూరిత రాజకీయాలకు తెర: అమిత్ షా

image

NCP(SP) చీఫ్ శరద్ పవార్‌ మహారాష్ట్ర వేదికగా 1978 నుంచి మోసపూరిత రాజకీయాలు చేస్తున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. సీఎంగా, కేంద్ర వ్యవసాయ మంత్రిగా పనిచేసినప్పటికీ ఆయన రైతు ఆత్మహత్యలను ఆపలేకపోయారని దుయ్యబట్టారు. పవార్ విధానాలతోపాటు ఉద్ధవ్ ఠాక్రే కుటుంబ, ద్రోహ రాజకీయాలకు 2024లో బీజేపీ విజయంతో తెరపడిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో శరద్, ఉద్ధవ్‌ల స్థానమేంటో ప్రజలు చూపించారని తెలిపారు.

News January 12, 2025

50% రాయితీపై పెట్రోల్.. వారికి మాత్రమే!

image

AP: స్వయం ఉపాధి పొందుతున్న లేదా ప్రైవేట్ జాబ్ చేస్తున్న దివ్యాంగులకు ప్రభుత్వం 50% సబ్సిడీపై పెట్రోల్, డీజిల్ అందించనుంది. లబ్ధిదారులు 3 టైర్ల మోటరైజ్డ్ వెహికల్స్ కలిగి ఉండాలి. సంక్షేమ శాఖ ఆఫీసుల్లో ఈనెల 31లోపు దరఖాస్తు చేసుకోవాలి. 2HP వాహనాలకు నెలకు 15 లీటర్ల వరకు, అంతకన్నా ఎక్కువ సామర్థ్యమున్న వాహనాలకు నెలకు 25 లీటర్ల వరకు రాయితీ లభిస్తుంది. బిల్లులు సమర్పిస్తే బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు వేస్తారు.