News January 12, 2025

శనగలు ఉడికిస్తూ ఇద్దరు యువకులు మృతి

image

శనగలు ఉడికించే క్రమంలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. నోయిడాకు చెందిన యువకులు శనగలను ఉడికించేందుకు స్టవ్‌పై చిన్న మంటతో పెట్టి మరిచిపోయారు. రాత్రంతా అలాగే ఉండడంతో ఆ మంట నుంచి కార్బన్ మోనాక్సైడ్ వాయువు విడుదలైంది. ఈ విషపూరితమైన వాయువుకు రంగు, రుచి, వాసన ఉండదు. ఇంటి డోర్, కిటికీలు క్లోజ్ చేసి ఉండడంతో ఆ వాయువు గదంతా వ్యాపించింది. దీంతో ఆక్సిజన్ అందక వారిద్దరూ స్పృహ కోల్పోయి చనిపోయారు.

Similar News

News January 13, 2025

కేజ్రీవాల్‌ది తప్పుడు ప్రచారం: రమేశ్ బిధూరీ

image

తనను ఢిల్లీ బీజేపీ సీఎంగా అభ్యర్థిగా ఆప్ చీఫ్ కేజ్రీవాల్ పేర్కొనడాన్ని రమేశ్ బిధూరి కొట్టిపారేశారు. ముఖ్యమంత్రి పదవిపై తనకు ఎలాంటి ఆశ లేదని ఈ బీజేపీ నేత స్పష్టం చేశారు. ఓటమి భయంతోనే ఆప్ చీఫ్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ తనకు చాలా ఇచ్చినట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

News January 13, 2025

తెలుగు రాష్ట్రాల సీఎంల సంక్రాంతి శుభాకాంక్షలు

image

తెలుగు రాష్ట్రాల ప్రజలకు CM రేవంత్, చంద్రబాబు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అన్ని కుటుంబాల్లో సంక్రాంతి కొత్త వెలుగులు తీసుకురావాలని రేవంత్ ఆకాంక్షించారు. పతంగులు ఎగురవేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రతి ఇంట్లో పండుగ శోభ వికసించాలని చంద్రబాబు ట్వీట్ చేశారు. సమాజంలో ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు మెరుగుపడినప్పుడే అందరి ఇళ్లలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని నమ్ముతున్నట్లు పేర్కొన్నారు.

News January 13, 2025

జనవరి 13: చరిత్రలో ఈరోజు

image

1948: హిందూ, ముస్లిముల సమైక్యత కోరుతూ గాంధీజీ తన చిట్టచివరి నిరాహారదీక్ష చేపట్టారు
1879: లయన్స్ క్లబ్ వ్యవస్థాపకుడు మెల్విన్ జోన్స్ జననం
1919: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి జననం
1949: అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయుడు రాకేష్ శర్మ జననం
1995: సినీ నటుడు వైష్ణవ్ తేజ్ జననం
2014: తెలుగు సినిమా నటి అంజలీదేవి మరణం