News January 12, 2025

హింసా రాజకీయాలకు సీఎం రేవంత్ ప్రోత్సాహం: హరీశ్ రావు

image

TG: INC ప్రభుత్వం అన్ని వర్గాలనూ మోసం చేసిందని BRS MLA హరీశ్ రావు విమర్శించారు. ప్రజలు ఆరు గ్యారంటీలను ప్రశ్నించకుండా ఉండేందుకు CM రేవంత్ హింసా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. రైతు కూలీలు, అన్ని రకాల వడ్లకు బోనస్, రుణమాఫీ విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా స్పందించడం లేదని ఫైరయ్యారు. ఉపాధి హామీ పనులకు వెళ్లేవారు కూడా రైతు కూలీలేనని, వారికి కూడా రూ.12,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Similar News

News January 13, 2025

సైనిక్ స్కూళ్లలో ప్రవేశాలు.. రేపే లాస్ట్ డేట్

image

సైనిక్ స్కూళ్లలో 6, 9 తరగతుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే రాత పరీక్షకు NTA దరఖాస్తులు స్వీకరిస్తోంది. రేపు (జనవరి 13) సా.5గంటల వరకూ <>ఆన్‌లైన్‌లో<<>> అప్లై చేసుకోవచ్చు. ఆరో తరగతి ప్రవేశాలకు ఐదో తరగతి చదువుతూ 10-12 ఏళ్ల వయసున్న వారు, 9వ తరగతిలో ప్రవేశాలకు 13-15 ఏళ్ల వయసు కలిగి 8వ తరగతి చదువుతున్న వారు అర్హులు. దరఖాస్తు ఫీజు SC, STలకు ₹650, మిగతా వారికి ₹800. ఫీజు చెల్లింపునకు ఎల్లుండి లాస్ట్ డేట్.

News January 13, 2025

ఉద్యోగుల సమస్యలపై ప్రతినెలా 2 సమావేశాలు

image

TG: రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల సర్వీస్ సమస్యలపై సత్వర పరిష్కారం కోసం ఆన్‌లైన్ విధానాన్ని తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రతి నెలా రెండో, నాలుగో శుక్రవారాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 వరకు సమావేశం నిర్వహిస్తామన్నారు. ఈ నెల 24న తొలి భేటీకి మంత్రి సీతక్క హాజరవుతారని తెలిపారు. ఇకపై ఉద్యోగులెవరూ హైదరాబాద్ వరకు రావాల్సిన అవసరం లేదన్నారు.

News January 12, 2025

‘గేమ్ ఛేంజర్’ రెండు రోజుల కలెక్షన్లు ఎంతంటే?

image

‘గేమ్ ఛేంజర్’ మూవీకి రెండు రోజుల్లో రూ.270 కోట్ల కలెక్షన్లు వచ్చినట్లు అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లు వైరలవుతున్నాయి. దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది. తొలి రోజు రూ.186 కోట్లు వచ్చినట్లు నిర్మాతలు వెల్లడించారు. శంకర్ డైరెక్షన్‌లో రామ్ చరణ్, కియారా జంటగా నటించిన ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వస్తున్న విషయం తెలిసిందే.