News January 12, 2025

మానవత్వం చాటుకున్న హోంమంత్రి అనిత

image

AP: హోంమంత్రి అనిత మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితులకు సహాయం చేశారు. విశాఖపట్నంలోని పాత గాజువాక జంక్షన్‌లో అనిత కారులో వెళ్తున్నారు. అదే సమయంలో ఓ బైక్‌ను ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ చిన్నారి గాయపడింది. వెంటనే ఆమె తన సిబ్బందిని ఆదేశించి ఆస్పత్రికి పంపించారు. ఇది చూసిన స్థానికులు మంత్రిని అభినందిస్తున్నారు.

Similar News

News January 13, 2025

నేటి నుంచి మహా కుంభ‌మేళా

image

నేటి నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా జరగనుంది. సుమారు 45 కోట్ల మందికి పైగా భక్తులు ఈ కార్యక్రమానికి వస్తారని యూపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. గంగా, యమునా, సరస్వతి నదులు కలిసే త్రివేణీ సంగమంలో స్నానమాచరిస్తే మోక్షం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. దీని నిర్వహణ కోసం యూపీ ప్రభుత్వం రూ.7వేల కోట్లు కేటాయించింది. ఫిబ్రవరి 26వరకు ఈ కుంభమేళా కొనసాగనుంది.

News January 13, 2025

పీహెచ్‌డీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

image

TG: ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్‌డీ ప్రవేశాలకు నోటిఫికేషన్ రిలీజైంది. ఈ నెల 24 నుంచి ఫిబ్రవరి 23 వరకు దరఖాస్తులు సమర్పించుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 24 నుంచి మార్చి 5 వరకు ఫైన్‌తో అప్లై చేసుకోవచ్చని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు www.ouadmissions.com, www.osmania.ac.in వెబ్‌సైట్‌లు సంప్రదించండి.

News January 13, 2025

కపిల్ దేవ్‌ను కాల్చేద్దామని తుపాకి తీసుకెళ్లా: యువరాజ్ తండ్రి

image

కపిల్‌దేవ్ హరియాణా జట్టుకు కెప్టెన్‌గా ఉన్న సమయంలో ఎలాంటి కారణం లేకుండా తనను టీమ్ నుంచి తొలగించినట్లు యువరాజ్ తండ్రి యోగ్‌రాజ్ తెలిపారు. ఆ సమయంలో కోపంలో కపిల్ ఇంటికి తుపాకితో వెళ్లానన్నారు. కపిల్ తల్లితో కలిసి బయటకు రాగా అతడిని తీవ్రంగా తిట్టానని, తలలోకి బుల్లెట్ దించాలని అనుకున్నట్లు చెప్పారు. వాళ్ల అమ్మను చూసి ఆగిపోయానన్నారు. ఆ తర్వాత క్రికెట్ ఆడకూడదని డిసైడ్ అయినట్లు యోగ్‌రాజ్ తెలిపారు.