News March 17, 2024
జయప్రదకు భారీ ఊరట
ప్రముఖ నటి జయప్రదకు భారీ ఊరట లభించింది. ESIC కేసులో ఆమెకు ఎగ్మోర్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు విధించిన 6 నెలల జైలు శిక్షను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈఎస్ఐసీ కింద రూ.8 లక్షలు చెల్లించాల్సి ఉండగా.. జయప్రద నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడినట్లు థియేటర్ కార్మికులు ఫిర్యాదు చేశారు. దీనిపై మెట్రోపాలిటన్ కోర్టు శిక్ష విధించింది. మద్రాస్ హైకోర్టు కూడా ఆ తీర్పును సమర్థించడంతో ఆమె సుప్రీంకు వెళ్లారు.
Similar News
News January 8, 2025
అదానీపైనే అభియోగాలేల? ప్రశ్నించిన రిపబ్లికన్ MP
విదేశీ కంపెనీల దర్యాప్తులో గౌతమ్ అదానీ కంపెనీలను జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ సెలక్టివ్‌గా టార్గెట్ చేయడమేంటని రిపబ్లికన్ లామేకర్ లాన్స్ గూడెన్ ప్రశ్నించారు. అమెరికా మిత్రదేశాలతో బంధాలను సంక్లిష్టం చేయొద్దని, విదేశాల్లో వదంతులను వేటాడటం మానేసి స్వదేశంలో దారుణాలను అరికట్టాలని జస్టిస్ డిపార్ట్‌మెంటుకు సూచించారు. ఒకవేళ అదానీపై అభియోగాలు నిజమని తేలినా భారత్‌లో అమెరికా ఏం చేయగలదని ప్రశ్నించారు.
News January 8, 2025
CT: అఫ్గాన్ మెంటార్‌గా యూనిస్ ఖాన్
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ యూనిస్ ఖాన్ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో అఫ్గానిస్థాన్ టీమ్ మెంటార్‌గా వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని అఫ్గాన్ క్రికెట్ బోర్డు ధ్రువీకరించింది. గతంలో ఆయన అఫ్గాన్‌కు బ్యాటింగ్ కోచ్‌గానూ పనిచేశారు. ఆయనకు PSL, అబుదాబి T10 లీగ్‌లో కోచ్‌గా పనిచేసిన అనుభవం ఉంది. ఫిబ్రవరి 19న పాకిస్థాన్VSన్యూజిలాండ్ మ్యాచుతో ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది.
News January 8, 2025
ఆ సినిమా చేసినందుకు చింతిస్తున్నా: రామ్ చరణ్
‘గేమ్ ఛేంజర్’ సినిమా విడుదల నేపథ్యంలో హీరో రామ్ చరణ్ ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో ఏ మూవీ చేసినందుకు చింతిస్తున్నారో తెలిపారు. జంజీర్ సినిమాను రీమేక్‌గా చేసినందుకు చింతిస్తున్నానని చెప్పుకొచ్చారు. ఈ సినిమాను తెలుగులో ‘తుఫాన్’గా విడుదల చేశారు. ఇందులో చరణ్, ప్రియాంకా చోప్రా ప్రధాన పాత్రల్లో నటించారు. 1973లో రిలీజైన ‘జంజీర్’లో అమితాబ్ బచ్చన్ నటించారు.