News March 17, 2024
నరసరావుపేట: ఎన్నికలపై సమీక్ష సమావేశం

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైనందున ఎన్నికల ప్రవర్తన నియమావళిని కఠినతరం చేయాలని కలెక్టర్ లోతేటి శివశంకర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదివారం స్థానిక కలెక్టరేట్లో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు ఎన్నికల నివేదికల సమర్పణ సి.విజిల్, సువిదయాప్, తదితర అంశాలపై ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల సిబ్బందితో జాయింట్ కలెక్టర్తో కలిసి కలెక్టర్ సమీక్ష చేశారు.
Similar News
News January 28, 2026
గుంటూరు జోన్లో 23 ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీ

గుంటూరు జోన్ పరిధిలో ఖాళీగా ఉన్న 23 ఫార్మసీ అధికారి (ఫార్మసిస్ట్ గ్రేడ్–II) పోస్టులను ఒప్పంద పద్ధతిలో భర్తీ చేయనున్నట్లు ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం వెల్లడించింది. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఉత్తర్వుల మేరకు ఈ నియామకాలు చేపట్టనుంది. దరఖాస్తులను జనవరి 29 నుంచి ఫిబ్రవరి 10 సాయంత్రం 5 గంటల వరకు గుంటూరు ఆర్డీఎంహెచ్ కార్యాలయంలో స్వీకరించనున్నట్లు పేర్కొంది.
News January 28, 2026
మధ్యాహ్న భోజనం నాణ్యతలో రాజీపడొద్దు: DEO

ప్రభుత్వ పాఠశాలల్లో రానున్న విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి కృషి చేయాలని DEO సలీం భాష ఉపాధ్యాయులకు సూచించారు. కేఎస్ఆర్ మున్సిపల్ స్కూల్, హిందూ, యాదవ హైస్కూల్, నల్లపాడు ZPస్కుల్స్ని బుధవారం DEO ఆకస్మికంగా పరిశీలించారు. విద్యార్థులకు ప్రతిరోజూ అందించే చిక్కీలు, కోడిగుడ్లపై గడువును పరిశీలన చేస్తూ ఉండాలని, నాణ్యత విషయంలో రాజీపడొద్దని చెప్పారు.
News January 28, 2026
రెవెన్యూ సేవలు మెరుగు పర్చాలి: కలెక్టర్

జిల్లాలో రెవెన్యూ సేవల పై ప్రజల సంతృప్తి స్థాయిని ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా మెరుగుపర్చాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా సూచించారు. కలెక్టరేట్లో బుధవారం రెవెన్యూ అధికారుల వర్క్ షాప్లో కలెక్టర్ మాట్లాడారు. దీర్ఘకాలికంగా ఉన్న రెవెన్యూ సమస్యలను సత్వర పరిష్కారం కోసం ప్రభుత్వం రెవెన్యూ శాఖలో తాజాగా అనేక సర్కూలర్స్ జారీ చేసిందన్నారు. కార్యక్రమంలో జేసీ శ్రీవాస్తవ, ఇతర అధికారులు పాల్గొన్నారు.


