News January 12, 2025
నెహ్రూ కంటే పటేల్, అంబేడ్కర్ PM పదవికి అర్హులు: ఖట్టర్

జవహర్‌లాల్ నెహ్రూ పొరపాటున దేశ ప్రధాని అయ్యారని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అభిప్రాయపడ్డారు. ఆయన కంటే సర్దార్ వల్లభాయ్ పటేల్, అంబేడ్కర్ ఆ పదవికి అర్హులని పేర్కొన్నారు. అంబేడ్కర్ వారసత్వాన్ని బీజేపీ కొనసాగించిందన్నారు. ఖట్టర్ వ్యాఖ్యలను హరియాణా మాజీ సీఎం భూపేందర్ హుడా తిప్పికొట్టారు. పొరపాటున సీఎం అయిన వ్యక్తులు ఇలా మాట్లాడకూడదని చురకలు అంటించారు.
Similar News
News December 28, 2025
భారీగా పెరిగిన ఎరువుల ధరలు

చైనా ఆంక్షల ఫలితంగా గతేడాదితో పోలిస్తే కాంప్లెక్స్ ఎరువుల ధరలు బస్తాకు రూ.100 నుంచి రూ.500 వరకు పెరిగాయి. 2023-24లో 50 కిలోల బస్తా రూ.1,250-రూ.1,450 మధ్య ఉన్న మిశ్రమ ఎరువుల రేట్లు ప్రస్తుతం రూ.1,450-రూ.1,950కు పెరిగాయి. అటు యూరియా, డీఏపీ ధరల్లో ఎలాంటి మార్పు లేకున్నా వ్యాపారులు ఎమ్మార్పీని మించి విక్రయిస్తున్నారు. దీంతో రబీ సీజన్లో పంటలు సాగు చేస్తున్న అన్నదాతలపై అదనపు భారం పడుతోంది.
News December 28, 2025
అధికారులు చూసుకుంటారు.. నాకేం సంబంధం?: భూమన

AP: తిరుమల కల్తీ నెయ్యి కేసులో TTD మాజీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డిని సిట్ 2 గంటలకు పైగా విచారించింది. అధికారుల ప్రశ్నలకు తనకేమీ తెలియదని ఆయన చెప్పినట్లు తెలిసింది. నెయ్యి సరఫరా గురించి అధికారులు చూసుకుంటారని, తామెందుకు పట్టించుకుంటామని అన్నట్లు సమాచారం. నాణ్యత లేదని నెయ్యిని తిరస్కరించడం ఎప్పటి నుంచో జరుగుతోందని చెప్పారని, NTR హయాం నుంచే ట్యాంకర్లను తిప్పి పంపుతున్నారని చెప్పినట్లు తెలుస్తోంది.
News December 28, 2025
వెన్నును బలిష్ఠంగా చేసే మేరుదండ ముద్ర

మేరుదండ ముద్రను రోజూ సాధన చెయ్యడం వల్ల వెన్నెముక ఆరోగ్యాన్ని మెరుగుపడటంతో పాటు వెన్నునొప్పిని తగ్గించడానికి సహాయపడుతుందంటున్నారు నిపుణులు. ముందుగా వజ్రాసనం/ సుఖాసనంలో కూర్చోని చేతులను తొడలపై ఉంచాలి. బొటన వేలును నిటారుగా పెట్టి మిగతా నాలుగువేళ్లను మడిచి ఉంచాలి. దీన్ని రోజూ సాధన చెయ్యడం వల్ల వెన్ను నొప్పి కూడా తగ్గుతుందంటున్నారు.


