News March 17, 2024
గంట నుంచీ విమానంలోనే సీఎం రేవంత్!
ముంబై వెళ్లేందుకు సీఎం రేవంత్ ఎక్కిన ఇండిగో విమానం సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. ముంబైలో రాహుల్ న్యాయ్ యాత్ర సభకు వెళ్లేందుకు ఆయనతో పాటు దీపాదాస్ మున్షీ, భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ తదితర అగ్రనేతలు విమానం ఎక్కారు. అయితే, ఫ్లైట్లో సాంకేతిక లోపం తలెత్తడంతో గంట నుంచీ అందులోనే ఉండిపోయారు. దీంతో వారి ముంబై ప్రయాణం ఆలస్యం కానుంది.
Similar News
News December 27, 2024
శుభ ముహూర్తం (27-12-2024)
✒ తిథి: బహుళ ద్వాదశి రా.1:16 వరకు
✒ నక్షత్రం: విశాఖ రా.7.59 వరకు
✒ శుభ సమయం: సా.5.00 నుంచి 6.00 వరకు
✒ రాహుకాలం: ఉ.10.30 నుంచి మ.12.00 వరకు
✒ యమగండం: మ.4.00 నుంచి 4.30 వరకు
✒ దుర్ముహూర్తం: ఉ.8.24 నుంచి 9.12 వరకు
✒ దుర్ముహూర్తం: మ.12.24 నుంచి 1.12 వరకు
✒ వర్జ్యం: రా.12.20 నుంచి 2.03 వరకు
✒ అమృత ఘడియలు: ఉ.10.21 నుంచి మ.12.05 వరకు
News December 27, 2024
TODAY HEADLINES
* మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత
* ఏపీలో ఈ నెల 31న పింఛన్ల పంపిణీ
* పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా?: సీఎం రేవంత్
* మస్కట్ బాధితురాలికి అండగా నారా లోకేశ్
* తెలంగాణ విద్యార్థులకు 11 రోజులు సెలవులు
* మహిళా కానిస్టేబుల్, ఎస్సై, కంప్యూటర్ ఆపరేటర్ ఆత్మహత్య?
* మహారాష్ట్ర ఎన్నికల్లో రిగ్గింగ్: రాహుల్ గాంధీ
* ప్రముఖ రచయిత, డైరెక్టర్ వాసుదేవన్ కన్నుమూత
* రూ.1,700 కోట్లు దాటిన ‘పుష్ప 2’ కలెక్షన్లు
News December 27, 2024
నా మార్గదర్శిని కోల్పోయా: రాహుల్ గాంధీ
అపార జ్ఞానం, సమగ్రతతో మన్మోహన్ సింగ్ దేశాన్ని ముందుకు నడిపించారని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కొనియాడారు. తన గురువు, మార్గదర్శిని కోల్పోయానన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆర్థిక శాస్త్రంలో మన్మోహన్కు ఉన్న లోతైన అవగాహన దేశానికి ఓ స్ఫూర్తి అని పేర్కొన్నారు. రాజకీయాల్లో ఆయన నిజాయితీ మనకు ఎప్పుడూ స్ఫూర్తిదాయకమని ఎంపీ ప్రియాంకా గాంధీ చెప్పారు.