News January 13, 2025
HYD: మొగిలిగిద్దకు సీఎం రాక

HYD శివారు షాద్‌నగర్‌లోని ఫరూఖ్‌నగర్ మండలంలో మొగిలిగిద్ద గ్రామ ప్రభుత్వ పాఠశాలను సీఎం రేవంత్ రెడ్డి సందర్శించనున్నారని ప్రొఫెసర్ హరగోపాల్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డిని గ్రామానికి చెందిన ప్రొఫెసర్ గ్రామస్థులు మర్యాదపూర్వకంగా కలిశారు. మొగిలిగిద్దలో పాఠశాలను ప్రారంభించి 150 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఉత్సవాలను ప్రారంభించడానికి రావాలని సీఎంను ఆహ్వానించారు.
Similar News
News November 8, 2025
జూబ్లీ బైపోల్: మాగంటి మరణం చుట్టూ రాజకీయం

చావు కూడా రాజకీయాలకు అతీతం కాదని ప్రస్తుత జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం నిరూపిస్తోంది. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం మిస్టరీ అని, దానిని ఛేదించాలని కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. సీఎం మరో ముందడుగు వేసి ఈ విషయంపై బండి సంజయ్ ఫిర్యాదు చేస్తే ప్రభుత్వం విచారణ చేస్తుందని పేర్కొన్నారు. దీంతో బైపోల్ పాలిటిక్స్ పీక్ స్థాయికి చేరుకున్నాయి.
News November 8, 2025
జూబ్లీహిల్స్ బైపోల్‌లో ఓట్లేయడానికి వస్తారా?

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 4.01 లక్షల మంది ఓటర్లున్నారు. ఇంతవరకు జరిగిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధికంగా 2009లో 52% మాత్రమే ఓట్లు పోలయ్యాయి. గత ఎన్నికల్లో (2023)లో అయితే కేవలం 47.49%. ఈసారి పోలింగ్ శాతం పెంచేందుకు అన్ని పార్టీల నాయకులు ప్రయత్నిస్తున్నారు. పోల్ పర్సెంటేజీ పెరిగితే ఆ ఓటింగ్ ఎవరికి లాభం? ఎవరికి నష్టం? అనేది 14నే తెలుస్తుంది. అంతా పర్సెంటేజీపైనే ఆధారపడి ఉంటుంది.
News November 8, 2025
జూబ్లీ బై పోల్: ఏజెంట్లకు గమనిక.. రేపు సాయంత్రం వరకే పాసులు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఏజెంట్లుగా కూర్చునే వారికి ఎన్నికల అధికారులు కీలక సూచనలు చేశారు. 11న ఎన్నికలు జరుగుతుండటంతో వివిధ రాజకీయ పార్టీల తరఫున ఎంపికైన ఏజెంట్లు పాసులు 10వ తేదీ సాయంత్రం లోపు తీసుకోవాల్సి ఉంటుంది. సోమవారం సాయంత్రం 5 గంటలలోపు స్థానిక బూత్‌తో అధికారులను కలిసి పాసులు పొందాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి సాయిరాం తెలిపారు. వీరంతా 11న ఉదయం 5 గంటలకే పోలింగ్ కేంద్రాలకు రావాలన్నారు.


