News January 13, 2025
భోగి మంటల వెనుక శాస్త్రీయ కోణం!

భోగీ నాడు ఊరువాడ భోగి మంటలు వేయడం అనవాయితీగా ఉన్నా దీనికి శాస్త్రీయ కోణం ఉంది. ఈ మంటలు వేయడం వల్ల పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా సామాజిక బంధాలు బలపడతాయి. అందరూ ఒక చోట చేరడంతో ఐక్యత పెరుగుతుంది. చలి కాలంలో ఉష్ణోగ్రతను పెంచుతాయి. ఇంట్లోని చెత్తను నిర్మూలించడమే కాకుండా ఈ బూడిద నుంచి పోటాషియం వంటి ఖనిజాలు మట్టికి అందుతాయి. ఈ మంటల్లో పిడకలను కాల్చడం వల్ల గాలి శుద్ది అవుతుంది.
Similar News
News November 2, 2025
అగ్‌హబ్ ఫౌండేషన్‌లో ఉద్యోగాలు

HYDలోని అగ్‌హబ్ ఫౌండేషన్ రూరల్ కోఆర్డినేటర్(2), కమ్యూనికేషన్ మేనేజర్(1) పోస్టులను ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేస్తోంది. పోస్టును బట్టి మాస్టర్ డిగ్రీ(మార్కెటింగ్, జర్నలిజం& మాస్ కమ్యూనికేషన్, పబ్లిక్ రిలేషన్, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్), డిగ్రీ( అగ్రికల్చర్ అనుబంధ కోర్సులు) ఉత్తీర్ణులు అర్హులు. ఆసక్తిగల అభ్యర్థులు NOV 21న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. వెబ్‌సైట్: https://pjtau.edu.in/
News November 2, 2025
తుంబురుడికి జ్ఞానప్రబోధం జరిగిన తీర్థం

తన గానంతో దేవలోకాన్ని మంత్రముగ్ధం చేసిన తుంబురుడు ఓనాడు ‘నాకన్నా ఉత్తమ గాయకుడు లేడు’ అనే గర్వంతో విర్రవీగిపోయాడు. అప్పుడు బ్రహ్మ ఆయనను భూమిపై మానవ రూపంలో జన్మిస్తావని శపించాడు. మానవ రూపంలో పుట్టిన తుంబురుడు ఘోర తపస్సు చేయగా నారదుడు ప్రత్యక్షమయ్యాడు. వీణానాదంతో తుంబురుడికి జ్ఞానప్రబోధం చేశాడు. ఆ ప్రదేశమే ‘తుంబురు తీర్థం’. ఇది తిరుమల కొండల్లో, బాలాజీ టెంపుల్‌కు 16KM దూరంలో ఉంది. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News November 2, 2025
వేరుశనగలో సాగుకు అనువైన అంతర పంటలు

వేరుశనగలో కంది, అనప, జొన్న, సజ్జ వంటివి అంతర పంటలుగా సాగుకు అనుకూలం. ఇవి పొడవైన వేరువ్యవస్థ కలిగి భూమి లోపలిపొరల నుంచి నీటిని తీసుకొని బెట్ట పరిస్థితులను సైతం తట్టుకునే శక్తిని కలిగి ఉంటాయి. ఇవి వేరుశనగ పంటతో పాటు నీడ, నీరు, పోషకాల విషయంలో పోటీపడవు. కంది, అనప పంటలైతే 6-7 వేరుశనగ వరుసల తర్వాత ఒక వరుసగా.. జొన్న, సజ్జ పంటలైతే 6 వేరుశనగ మొక్కల వరుసల తర్వాత 2 వరుసలుగా నాటి సాగుచేసుకోవచ్చు.


