News March 17, 2024

గ్రూప్-1 ప్రిలిమ్స్: మొబైల్‌తో కాపీయింగ్.. వ్యక్తి అరెస్ట్

image

AP: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో మొబైల్‌తో కాపీయింగ్‌కు పాల్పడుతున్న అభ్యర్థిని పోలీసులు అరెస్టు చేశారు. ఒంగోలులోని క్విస్ ఇంజినీరింగ్ కాలేజీలో ఈ ఘటన జరిగింది. సెక్యూరిటీ సిబ్బంది కళ్లుగప్పి అభ్యర్థి పరీక్ష కేంద్రంలోకి మొబైల్ తీసుకెళ్లాడు. అక్కడి నుంచి బయటి వ్యక్తులకు ఫోన్ చేసి సమాధానాలు రాస్తుండగా ఇన్విజిలేటర్ గుర్తించి పోలీసులకు అప్పగించారు.

Similar News

News July 8, 2024

రూ.900 కోట్ల కలెక్షన్లు సాధించిన ‘కల్కి’

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి’ రూ.వెయ్యి కోట్ల దిశగా దూసుకుపోతోంది. జూన్ 27న రిలీజైన ‘కల్కి’ ఇప్పటివరకు రూ.900 కోట్లు (గ్రాస్) కలెక్ట్ చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈనెల 12న ‘భారతీయుడు-2’ రిలీజ్ కానుండగా అప్పటివరకూ ‘కల్కి’ ఫీవర్ కొనసాగనుంది. ఈ సినిమాలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దుల్కర్, విజయ్ దేవరకొండ, దీపికా పదుకొణె, దిశా పటాని నటించారు.

News July 8, 2024

‘బాస్’లను అమ్మకానికి పెడుతున్నారు!

image

చైనాలో కొత్త ట్రెండ్ నడుస్తోంది. తమకు నచ్చని బాస్‌లు, సహోద్యోగులను కొందరు ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెడుతున్నారు. దీంతో సెకండ్ హ్యాండ్ ఈకామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో ఎక్కడ చూసినా బాస్‌ ఫర్ సేల్, కొలీగ్స్ ఫర్ సేల్ అనే ప్రకటనలు దర్శనమిస్తున్నాయి. రూ.4లక్షల నుంచి రూ.9లక్షల మధ్య ధర ఫిక్స్ చేస్తున్నారు. అయితే ఇక్కడ నిజంగా అమ్మడం, కొనడం జరగవు. కేవలం సంతృప్తి కోసమే అలా ఆన్‌లైన్‌లో ప్రకటనలు చేస్తున్నారు.

News July 8, 2024

పిల్లలు ఎవరితో చాట్ చేస్తున్నారో చెక్ చేయండి: పోలీసులు

image

TG: మొబైల్ ఫోన్ వాడకంతో పిల్లలు తప్పుదారి పడుతున్నారని, 9వ తరగతి పిల్లల ప్రవర్తనను పేరెంట్స్ ఎప్పటికప్పుడు గమనిస్తుండాలని పోలీసులు సూచించారు. ‘పిల్లలు ఎదుగుతున్నారంటే వారికి చెడు దారులు సైతం ఎదురవుతాయి. మంచి- చెడు మధ్య తేడా తెలియని వారినే డ్రగ్స్ మాఫియా టార్గెట్ చేస్తోంది. ఎవరితో చాట్ చేస్తున్నారో చెక్ చేయండి. అప్రమత్తంగా ఉండటం మన బాధ్యత’ అని పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు.
>>SHARE IT