News January 13, 2025
గాలిపటాలు ఎగురవేస్తున్నారా?
సంక్రాంతి అంటేనే గాలిపటాలు ఎగురవేయడం తప్పనిసరి. ముఖ్యంగా పిల్లలు గాలిపటాలు ఎగురవేయాలని ఉత్సాహపడుతుంటారు. వీటిని ఎగురవేసే సమయంలో మాంజాను కాకుండా సాధారణ దారాలను ఉపయోగించాలి. రోడ్ల పక్కన, రైల్వే ట్రాకులు, విద్యుత్ పోల్స్ సమీపంలో ఎగరవేయడం ప్రమాదకరం. భవనాలపై ఎగురవేసినప్పుడు, చిన్నపిల్లలు పక్కన ఉంటే జాగ్రత్తగా ఉండాలి. కాళ్లకు గాయాలు కాకుండా షూలు, చెప్పులు ధరించడం తప్పనిసరి.
Similar News
News January 13, 2025
రూ.582 కోట్లతో తెలంగాణ ప్రభుత్వ స్టార్ హోటల్.. త్వరలో నిర్మాణం!
TG: హైదరాబాద్ హైటెక్ సిటీ సమీపంలోని రాయదుర్గంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ-గ్రేడ్ ట్రేడ్ సెంటర్‌తో కూడిన ఫైవ్ స్టార్ హోటల్‌ను నిర్మించనుంది. 3 ఎకరాల్లో ₹582 కోట్లతో 15 అంతస్తుల భవనాన్ని నిర్మించాలని నిర్ణయించింది. వరల్డ్‌లోనే టాప్-10లో ఉండేలా అంతర్జాతీయ ప్రమాణాలతో బిల్డ్ చేయనుంది. ఇప్పటికే బిడ్డర్ల నుంచి టెండర్లు ఆహ్వానించింది. 36 నెలల్లో హోటల్‌ను అందుబాటులోకి తేవాలని పేర్కొంది.
News January 13, 2025
ట్రంప్‌కు జగ్మీత్ సింగ్ వార్నింగ్
కెనడాను అమెరికాలో భాగం చేసుకోవాలనుకుంటున్న డొనాల్డ్ ట్రంప్‌కు న్యూ డెమోక్రటిక్ పార్టీ (NDP) లీడర్ జగ్మీత్ సింగ్ వార్నింగ్ ఇచ్చారు. ‘మా దేశం అమ్మకానికి లేదు. ఇప్పుడే కాదు.. ఎప్పటికీ స్వతంత్రంగానే ఉంటాం. ఒకవేళ మాతో ఫైట్ చేయాలనుకుంటే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మా దేశంపై ట్రంప్ టారిఫ్స్ వేస్తే మేమూ అదే పని చేస్తాం’ అని హెచ్చరించారు. కాగా మాజీ PM ట్రూడోకు NDP గతంలో మిత్రపక్షంగా ఉండేది.
News January 13, 2025
ఆన్‌లైన్‌లో ‘డాకు మహారాజ్’ HD ప్రింట్!
బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ సినిమా విడుదలైన రోజునే ఆన్‌లైన్‌లో దర్శనమిచ్చింది. పైరసీ సైట్లలో HD ప్రింట్ రావడంతో ఫ్యాన్స్ షాకయ్యారు. ఇటీవల రిలీజైన ‘గేమ్ ఛేంజర్’ మూవీని కూడా విడుదలైన రోజునే ఆన్‌లైన్‌లో పెట్టేశారు. అంతేకాకుండా బస్సులో సినిమాను ప్రదర్శించిన వీడియో సైతం వైరల్ అయింది. ఇలా సినిమాలను లీక్ చేయడం వల్ల నిర్మాతలు నష్టపోతారని, పైరసీని ఆపాలని పలువురు సినీ పరిశ్రమ అభిమానులు కోరుతున్నారు.