News March 17, 2024
గన్నవరం చేరుకున్న ప్రధాని మోదీ

AP: ప్రధాని మోదీ గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. చిలకలూరిపేటలో టీడీపీ-బీజేపీ-జనసేన నిర్వహిస్తోన్న ప్రజాగళం బహిరంగసభకు కాసేపట్లో హాజరుకానున్నారు. పదేళ్ల తర్వాత మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒకే వేదిక మీద కనిపించనుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Similar News
News April 3, 2025
BREAKING: సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

జడ్జిల ఆస్తుల వివరాలు ప్రజలకు తెలిసేలా కోర్టు వెబ్‌సైట్‌లో పబ్లిష్ చేయనున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. ఏప్రిల్ 1న జరిగిన ఫుల్ కోర్టు మీటింగ్‌లో మొత్తం 33 మంది జడ్జిల అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సంస్కరణ సుప్రీంకోర్టుకు భవిష్యత్‌లో వచ్చే జడ్జిలకూ వర్తిస్తుందని తెలిపింది. ఇటీవల జడ్జి యశ్వంత్ వర్మ(ఢిల్లీ హైకోర్టు మాజీ జడ్జి) ఇంట్లో భారీగా నోట్లకట్టలు లభ్యమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
News April 3, 2025
ఆ నోళ్లను 10 నెలల్లోనే మూయించాం: లోకేశ్

AP: రాష్ట్రంలో JCB పాలన పోయి, పేదలకు పట్టాలిచ్చే ప్రభుత్వం వచ్చిందని మంత్రి లోకేశ్ అన్నారు. తాను గెలిస్తే మంగళగిరిలోని ఇళ్లు పీకేస్తారంటూ ప్రచారం చేసిన నోళ్లను 10నెలల్లోనే మూయించామని తెలిపారు. ప్రభుత్వ భూముల్లో నివసించే వారికి పట్టాలిచ్చే హామీని తన నియోజకవర్గం నుంచే నెరవేరుస్తున్నట్లు చెప్పారు. తొలి విడత 3వేల ఇళ్ల పట్టాలు అందిస్తామన్నారు. స్వచ్ఛతలో మంగళగిరిని దేశంలోనే నంబర్-1 చేస్తామని చెప్పారు.
News April 3, 2025
ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్.. తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు

పార్టీ ఫిరాయించిన తెలంగాణ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ప్రభుత్వం, పిటిషనర్ల తరఫు న్యాయవాదుల వాదనల ముగిశాయి. హిమాచల్ ఎమ్మెల్యే రాణా అనర్హత కేసు విషయాన్ని SC ప్రస్తావించగా అది పూర్తిగా విభిన్నమని ప్రభుత్వ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ పేర్కొన్నారు. మరోవైపు సుప్రీంకోర్టుకు వచ్చాక న్యాయవాదుల తీరు మారిపోతోందని జస్టిస్ బీఆర్ వ్యాఖ్యానించారు.