News January 13, 2025
నేటి నుంచి SU పరిధిలోని కళాశాలలకు సెలవులు

సంక్రాంతి పండగ నేపథ్యంలో.. కరీంనగర్ పట్టణంలోని శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని కళాశాలలకు సెలవులు ప్రకటించారు. యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ, పీజీ, బీఈడీ, ఫార్మసీ, ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలకు నేటి నుంచి ఈ నెల 15 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించినట్లు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు తిరిగి 16 నుంచి తరగతులకు హాజరు కావాలన్నారు.
Similar News
News January 10, 2026
KNR: రైతులు ఆందోళన చెందవద్దు: కలెక్టర్

కరీంనగర్ జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులు ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. గత పది రోజుల్లో వివిధ సొసైటీల ద్వారా 6,665 మెట్రిక్ టన్నుల యూరియాను అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రస్తుతం జిల్లాలో మరో 2,553 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయని పేర్కొన్నారు. అవసరానికి మించి నిల్వ చేయవద్దని, డిమాండ్ మేరకు మరిన్ని నిల్వలు తెప్పిస్తామని రైతులకు సూచించారు.
News January 10, 2026
KNR: ‘పోలింగ్ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలి’

మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా పోలింగ్ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్ అధికారులను ఆదేశించారు. కరీంనగర్‌లోని పలు పోలింగ్ కేంద్రాలను శుక్రవారం ఆయన తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రాల మధ్య నిర్ధేశిత దూరాన్ని పాటించాలని, విద్యుత్, తాగునీరు, లైటింగు, వికలాంగుల సౌకర్యార్థం ర్యాంపులను ఏర్పాటుచేయాలన్నారు.
News January 9, 2026
కరీంనగర్: ‘బాలికలను అన్ని రంగాల్లో తీర్చిదిద్దాలి’

కేజీబీవీ విద్యార్థినులను విద్యావంతులుగా మార్చి, అన్ని రంగాల్లో రాణించేలా తీర్చిదిద్దాలని కరీంనగర్ అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను కోరారు. ‘నీపా’ (NIEPA) సౌజన్యంతో కేజీబీవీ ప్రత్యేక అధికారులు, వార్డెన్లకు నిర్వహిస్తున్న ఐదు రోజుల శిక్షణలో ఆమె మాట్లాడారు. బాలికలు స్వశక్తితో ఎదిగేలా ప్రోత్సహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శిక్షణ డైరెక్టర్ దేబోర కృపారాణి అధికారులు పాల్గొన్నారు.


