News March 17, 2024

ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: జిల్లా కలెక్టర్

image

ఈసారి ఎన్నికల్లో డబ్బు, శరీర బలం, తప్పుడు సమాచారం, ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలను తీవ్రంగా పరిగణిస్తామని ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ గౌతమ్ తెలిపారు. సోషల్ మీడియా ప్రచారంలో రాజకీయ పార్టీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. విద్వేషపూరిత ప్రసంగాలు, తప్పుడు వార్తలు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Similar News

News October 31, 2025

సీఎం సారూ.. ఖమ్మం రండి: ముంపు వాసులు

image

ఖమ్మంలో మున్నేరు ముంపు వాసులను ఆదుకోవాలన్న డిమాండ్ వినిపిస్తుంది. 26 అడుగులకు పైగా మున్నేరు ప్రవహించిన నేపథ్యంలో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. అయితే వరదతో జరిగిన నష్టాన్ని తెలుసుకునేందుకు సీఎం రేవంత్ ఈ రోజు వరంగల్‌లో ఏరియల్ సర్వే చేస్తున్నారు. ఖమ్మంలో పర్యటించడం లేదు. దీంతో ముంపు వాసులు సీఎం తమ ప్రాంతంలో పర్యటించి తమను ఆదుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

News October 31, 2025

నేటి నుంచి విజయ డెయిరీ దుకాణాలకు టెండర్లు

image

ఖమ్మం నగరంలోని విజయ డెయిరీ ఆవరణలో నిర్మించిన 10 దుకాణ సమూదాయాలను అద్దెకు ఇచ్చేందుకు నవంబర్ 1 నుంచి 25వ తేదీ వరకు టెండర్లు నిర్వహిస్తున్నట్లు డెయిరీ డిప్యూటీ డైరెక్టర్ కోడిరెక్క రవికుమార్ తెలిపారు. ఒక్కో దుకాణానికి నెలకు రూ.15వేలుగా నిర్ణయించామని, సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.2 లక్షలు చెల్లించాలన్నారు.

News October 31, 2025

మాజీ సర్పంచ్ రామారావు హత్యపై సీపీ ఆరా

image

చింతకాని పాతర్లపాడు మాజీ సర్పంచ్, సీపీఎం నేత సామినేని రామారావు హత్య ఘటనపై పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీపీఎం నేతలు గోపాలరావు, సుదర్శన్‌ నుంచి ఆయన వివరాలు సేకరించారు. ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంలో సీపీ దర్యాప్తును వేగవంతం చేయాలని ఆదేశించారు.