News January 13, 2025

అనంతపురానికి CM అన్యాయం చేస్తున్నారు: తోపుదుర్తి

image

కుప్పం ప్రజలకు నీరు ఇవ్వడానికి CM చంద్రబాబు అనంతపురం జిల్లా ప్రజల కడపుకొడుతున్నారని రాప్తాడు మాజీ MLA తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి మండిపడ్డారు. ‘కుప్పానికి నీళ్లు తరలించడానికి అనంతపురం జిల్లా పరిధిలో హంద్రీనీవా కాలువలో లైనింగ్ పనులు చేస్తున్నారు. దీంతో జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటిపోతాయి. 5లక్షల ఎకరాలకు నీరు అందదు. CMకు రాజకీయం తప్ప అనంతపురం ప్రజల ప్రయోజనాలు పట్టడం లేదు’ అని తోపుదుర్తి అన్నారు.

Similar News

News January 12, 2026

అనంతపురం జిల్లా JC బదిలీ

image

అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ బదిలీ అయ్యారు. ఆయనను అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్‌గా బదిలీ చేస్తూ చీఫ్ సెక్రటరీ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు జిల్లా నూతన జాయింట్ కలెక్టర్‌గా సి.విష్ణుచరణ్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ సెక్రటరీగా ఉన్నారు. త్వరలోనే జిల్లా జేసీగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

News January 12, 2026

అనంతపురం శిల్పారామంలో 14న సంక్రాంతి సంబరాలు

image

అనంతపురంలోని శిల్పారామంలో ఈ నెల 14 నుంచి 16 వరకు సంక్రాంతి సంబరాలను నిర్వహిస్తున్నట్లు పరిపాలన అధికారి పి.శివ ప్రసాద్ రెడ్డి ఆదివారం తెలిపారు. సంస్కృతీ సంప్రదాయాల సమాహారం శిల్పారామం అన్నారు. సంక్రాంతి పండగను పురస్కరించుకొని విభిన్నమైన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. 3 రోజులు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7:30 వరకు సంబరాలను నిర్వహిస్తామన్నారు.

News January 11, 2026

BREAKING: ATP ట్రాక్టర్ బోల్తా.. వ్యక్తి మృతి

image

ట్రాక్టర్ బోల్తాపడటంతో వ్యక్తి మృతి చెందిన ఘటన మద్దికేరలో ఆదివారం చోటు చేసుకుంది. వజ్రకరూరు మండలం కమలపాడుకు చెందిన బోయ కిష్టప్ప పత్తికొండకు ఇటుకల లోడుతో వెళ్తున్నాడు. కర్నూలులోని బురుజుల రోడ్డు సెల్ టవర్ వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. వాహనంపై ఉన్న అబ్దుల్ అజీజ్, శివ గాయపడ్డారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన్నట్లు ఎస్సై హరిత తెలిపారు.