News January 13, 2025
నిఫ్టీ 200, సెన్సెక్స్ 700 డౌన్.. Rs3L CR లాస్

<<15141868>>అంచనా<<>> వేసినట్టే దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ గ్యాప్‌డౌన్‌తో ఆరంభమయ్యాయి. నిఫ్టీ 23,217 (-213), సెన్సెక్స్ 76,707 (-675) వద్ద ట్రేడవుతున్నాయి. దీంతో పొద్దున్నే రూ.3లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఫియర్ ఇండెక్స్ ఇండియా విక్స్ 6.85 పాయింట్లు పెరిగి 15.94కు చేరుకుంది. ఆటో, మెటల్, ఫార్మా, ఫైనాన్స్, రియాల్టి, హెల్త్‌కేర్, కన్జూమర్ డ్యురబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు విలవిల్లాడుతున్నాయి.
Similar News
News February 2, 2026
పెళ్లి కాదు పనే ముఖ్యం: బాస్

కొందరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో చెప్పే ఓ ఘటన SMలో వైరలవుతోంది. ‘నా ఎంగేజ్మెంట్ 2 నెలల క్రితమే చెప్పాను. ఆ విషయాన్ని గాలికొదిలేసి ఇప్పుడు ఎంగేజ్మెంట్ ముఖ్యం కాదు వీకెండ్ కూడా పని చేయమంటున్నారు. ఇక్కడ చేసే వారికంటే పని చెప్పేవారు ఎక్కువ. గంటలు గంటలు జూమ్ కాల్స్ మాట్లాడాలి. నేను ఈ ప్రాజెక్టులో కొనసాగలేను. నా పెళ్లి కూడా వాయిదా వేసుకోలేను’ అని ఆవేదనను వ్యక్తం చేశారు.
News February 2, 2026
మ్యాడ్ సిరీస్‌లో క్రేజీ యాక్టర్స్!

యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్స్‌గా హిట్లు అందుకున్న ‘మ్యాడ్’, ‘మ్యాడ్ స్క్వేర్’ సిరీస్‌లో మూడో సినిమా రాబోతోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘మ్యాడ్ జూనియర్స్’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. ఇందులో లిటిల్ హార్ట్స్ ఫేమ్ జై కృష్ణ, కోర్ట్ ఫేమ్ హర్ష్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైందని సినీ వర్గాలు వెల్లడించాయి.
News February 2, 2026
లా అండ్ ఆర్డర్ సమస్య తేవాలని YCP చూస్తోంది: చంద్రబాబు

AP: రాష్ట్రంలో లా & ఆర్డర్ సమస్య తేవాలని YCP చూస్తోందని CM CBN విమర్శించారు. తాజా ఘటనలపై ఆయన TDP నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘TTD లడ్డూ వ్యవహారంలో దొరికిపోయిన YCP దాన్ని దారిమళ్లించేందుకు బూతులు ఎత్తుకుంది. TDPని రెచ్చగొట్టి అలజడి సృష్టించాలని చూస్తోంది. ఆ ట్రాప్‌లో పార్టీ నేతలు, కార్యకర్తలు పడొద్దు. రాష్ట్రంలో ఎంతో అభివృద్ది జరుగుతోంది. అన్ని వర్గాలూ సంతోషంగా ఉన్నాయి’ అని వివరించారు.


