News March 17, 2024
మహబూబ్‌నగర్ లోక్ సభ పరిధిలోని ఓటర్లు

మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం 16,80,417 మంది ఓటర్లు ఉన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటర్ల వివరాలిలా..
✓ మహబూబ్‌నగర్ అసెంబ్లీలో – 2,58,658
✓ జడ్చర్ల అసెంబ్లీలో- 2,23,222
✓ దేవరకద్ర అసెంబ్లీలో – 2,39,077
✓ నారాయణపేట అసెంబ్లీ – 2,35,517
✓ మక్తల్ అసెంబ్లీ – 2,43,338
✓ కొడంగల్ అసెంబ్లీలో – 2,42,267
✓ షాద్‌నగర్ అసెంబ్లీలో – 2,38,338 మంది ఉన్నారు
Similar News
News October 28, 2025
MBNR: టీఆర్పి పార్టీ మేధావుల నిపుణుల కమిటీ ఛైర్మన్ నియామకం

MBNR జిల్లా కేంద్రానికి చెందిన రిటైర్డ్ డీఈవో, డాక్టర్ శివార్చక విజయ్ కుమార్‌ను తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న వీరిని రాష్ట్ర మేధావులు, నిపుణుల సమన్వయ కమిటీ ఛైర్మన్‌గా నియమించారు. వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ బలోపేతం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలను అంకితభావం నిబద్దతతో కలుపుకొని క్షేత్రస్థాయిలో కమిటీలు వేసి పార్టీని బలోపేతం చేయాలన్నారు.
News October 28, 2025
MBNR: మొక్కజొన్న కొనుగోలు కేంద్రం పరిశీలన

వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి మంగళవారం సందర్శించారు. మొక్కలు ఎండబెట్టుకుని శుభ్రంగా తీసుకొస్తే ప్రభుత్వం మద్దతు ధర ఇస్తుందని సూచించారు. పత్తి రైతులతో మాట్లాడుతూ.. స్లాట్ బుకింగ్ చేసుకుని వస్తే సీసీఐ పత్తి కొనుగోలు చేసిందన్నారు. తుపాన్ కారణంగా రేపు ఎల్లుండి వర్షం పడే అవకాశం ఉన్నందున రైతులు జాగ్రత్తగా తీసుకోవాలన్నారు.
News October 28, 2025
కురుమూర్తి ఉద్దాల ఉత్సవంలో జేబుదొంగల చేతివాటం

వడ్డేమాన్ ఉద్దాల మండపం వద్ద కురుమూర్తి స్వామి జాతర ఉత్సవాల సందర్భంగా జేబుదొంగలు చేతివాటం ప్రదర్శించారు. లాలకోటకు చెందిన నర్సింహులు జేబులో ఉన్న దాదాపు రూ.10 వేలను దొంగిలించారు. వందలాది పోలీసులు భద్రతలో ఉన్నప్పటికీ, జేబుదొంగలు తమ పనిని కొనసాగించడం విశేషం. కాగా జాతర మైదానంలో ఏటా ఇలాంటి ఘటనలు సర్వ సాధారణంగా మారిపోయాయి. ఘటనపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.


