News January 13, 2025

కూసుమంచిలో 30 రోజుల్లోనే ఇందిరమ్మ మోడల్ ఇల్లు పూర్తి

image

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం ప్రతీ మండలంలో ఒక నమూనా ఇంటి నిర్మాణానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. కాగా గత నెల 13న మంత్రి పొంగులేటి కూసుమంచి ఎమ్మార్వో ఆఫీసు దగ్గర ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేయగా నెల రోజుల్లోనే పూర్తి చేశారు. రాష్ట్రంలోనే తొలి నమునా ఇల్లు కూసుమంచిలో అందుబాటులోకి వచ్చింది. రూ.5లక్షలతో ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు కాంట్రాక్టర్ జీవన్ రెడ్డి తెలిపారు.

Similar News

News January 15, 2025

KMM: పండుగపూట.. యువకుడి కిడ్నాప్ కలకలం!

image

పండగపూట యువకుడు కిడ్నాప్‌నకు గురైన ఘటన ఖమ్మంలో చోటుచేసుకుందని స్థానికులు తెలిపారు. వారి వివరాలిలా.. పోలెపల్లి రాజీవ్ గృహ కాలనీకి చెందిన సంజయ్ కుమార్ సోమవారం రాత్రి తన అన్నను తీసుకురావడానికి బస్టాండ్‌కు వెళ్తుండగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని అన్న సాయికి సంజయ్ కుమార్‌ ఫోన్ చేశాడు. కొద్ది సేపటికే సంజయ్ ఫోన్ కలవకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

News January 14, 2025

కూసుమంచి: రైతులు విన్నవించారు.. మంత్రి స్పందించారు

image

ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా కూసుమంచి మండలం చౌటపల్లి వద్ద లిఫ్ట్ ఇరిగేషన్‌కు సంబంధించిన పైపులు దెబ్బతినడంతో నీటి సరఫరా ఆగిపోయింది. ఈసందర్భంగా రైతులు స్థానిక నాయకుల ద్వారా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో సమస్యను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మంత్రి ఆదేశాలతో అధికారులు సమస్యను పరిష్కరించారు. నేడు నీటిని విడుదల చేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.

News January 14, 2025

ఖమ్మం శివారులో మహిళ సూసైడ్ 

image

చెట్టుకు ఉరి వేసుకొని ఓ మహిళ మృతి చెందిన ఘటన ఖమ్మం రూరల్ మండలంలో ఈ ఉదయం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం రూరల్ మండలం వెంకటగిరి క్రాస్ రోడ్ సమీపంలో గుర్తుతెలియని మహిళ చెట్టుకు ఉరివేసుకొని సూసైడ్ చేసుకుంది. స్థానికులు గమనించి పోలీసులకు సమచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.