News January 13, 2025
NLG: పండగ తర్వాత రంగంలోకి బృందాలు
ఉమ్మడి నల్గొండ జిల్లాలో పండుగ తర్వాత సాగు యోగ్యం కాని రాళ్లు, రప్పలు, గుట్టలతో కూడిన భూములను పక్కాగా గుర్తించనున్నారు. నివాస స్థలాలు, రియల్ ఎస్టేట్ భూములు, రహదారులు, పరిశ్రమలు, గోదాములు, మైనింగ్ అవసరాలకు సేకరించిన స్థలాలను పూర్తిగా పరిహరిస్తారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఉమ్మడి జిల్లాలో మునుపటి కంటే ‘రైతు భరోసా’ లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం కనిపిస్తోంది.
Similar News
News January 13, 2025
NLG: ఢిల్లీలో సత్తా చాటిన మోడల్ స్కూల్ విద్యార్థులు
తుర్కపల్లి మండలం రాంపూర్ తండాలోని మోడల్ స్కూల్ విద్యార్థులు సత్తా చాటారు. ఢిల్లీలో భారతి మండపంలో నిర్వహించిన జాతీయ స్థాయి వికసిత్ భారత్ సైన్స్ ఎగ్జిబిషన్ మోడల్ స్కూల్ విద్యార్థులు తయారుచేసిన చార్జింగ్ ఎలక్ట్రిక్ నానో ట్రాక్టర్ ప్రాజెక్ట్ ఎంపికైంది. పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థులు లూనావత్ అఖిల్, బానోతు తరుణ్లను ఉపాధ్యాయ బృందం అభినందనలు తెలిపారు.
News January 13, 2025
NLG: ఉమ్మడి జిల్లాలో భోగి సంబురం
మూడు రోజుల సంక్రాంతి పండగకు ఉమ్మడి జిల్లాలోని పల్లెలు, పట్టణాలు ముస్తాబయ్యాయి. తొలి రోజు భోగి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. పట్టణాలు, పల్లెల్లో మహిళలు వాకిట్లో రంగురంగుల ముగ్గులు వేస్తున్నారు. తీపి వంటకాల తయారీలో మహిళలు నిమగ్నమయ్యారు. పల్లెల్లో ఉదయమే భోగిమంటలతో ప్రజలు పండుగకు ఆహ్వానం పలికారు. మరోవైపు చిన్నారులు పతంగులు ఎగరేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.
News January 13, 2025
సూర్యాపేట: తాగి వచ్చి వేధింపులు.. భర్త హత్య
సూర్యాపేట జిల్లాలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాలిలా.. చివ్వెంల మండలం గుర్రంతండాకు చెందిన సైదులు కారు డ్రైవర్. అతనికి రమ్య, సుమలత అనే ఇద్దరు భార్యలున్నారు. సైదులు తాగి వచ్చి వారిని వేధిస్తున్నాడు. ఈక్రమంలో ఇద్దరు భార్యలు కలిసి సైదులును ఆదివారం అర్ధరాత్రి హత్య చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.